Begin typing your search above and press return to search.

'RRR' ఓటీటీ విధ్వంసం ఎప్పుడు? జ‌క్క‌న్న‌!

By:  Tupaki Desk   |   6 April 2022 11:30 AM GMT
RRR ఓటీటీ విధ్వంసం ఎప్పుడు? జ‌క్క‌న్న‌!
X
పాన్ ఇండియా చిత్రం 'ఆర్ ఆర్ ఆర్' సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే 800 కోట్ల‌ను క్రాస్ చేసి 100 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌కి చేరువ‌లో ఉంది. తెలుగు రాష్ర్టాలు స‌హా ఓవ‌ర్సీస్ లోనూ 'ఆర్ ఆర్ ఆర్' రికార్డు వ‌సూళ్ల‌తో దూసుకుపోతుంది. ఇప్ప‌టికే అమెరికాలో $12.65 మిలియ‌న్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించింది. ఇక నైజాంలో 100 కోట్ల షేర్ సాధించిన‌ట్లు టాక్ వినిపిస్తుంది.

అదే నిజ‌మైతే నైజాంలో తెలుగు సినిమా రికార్డుగా చెప్పొచ్చు. ప్ర‌స్తుతం త‌గ్గిన టెక్కెట్ ధ‌ర‌ల‌తో తెలుగు రాష్ర్టాల్లో సినిమా ర‌న్నింగ్ లో ఉంది. దాదాపు అన్ని థియేట‌ర్ల‌లోనూ 'ఆర్ ఆర్ ఆర్' హ‌వా ఇప్ప‌టికీ కొన‌సాగుతుంది. మ‌రి ఈ ఊపు ఇంకా ఎంత కాలం కొన‌సాగుతుందో ఇప్ప‌ట్లో చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇద్ద‌రు బిగ్ స్టార్లు భాగ‌మైన సినిమా కాబ‌ట్టి ర‌న్నింగ్ డేస్ ని ఎన‌లిస్ట్ లు సైతం అంచ‌నా వేయ‌డం క‌ష్టంగానే ఉంది. ఇక 'ఆర్ ఆర్ ఆర్' ఓటీటీ బిజినెస్ పెద్ద ఎత్తున జ‌రిగింద‌న్న‌ది తెలిసిందే.

జీ-5..నెట్ ప్లిక్స్ సంస్థలు ఓటీటీ రైట్స్ ని ఏరియాల వైజ్ ద‌క్కించుకున్నాయి. సౌత్ లో అన్ని భాష‌ల ఓటీటీ రైట్స్ ని జీ-5 ద‌క్కించుకోగా హిందీలో నెట్ ప్లిక్స్ రిలీజ్ చేస్తుంది. అయితే ఓటీటీ రిలీజ్ సినిమాకి పెద్ద ఎత్తున క‌లిసొస్తుంద‌ని తెలుస్తోంది. థియేట్రిక‌ల్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. కాబ‌ట్టి ఓటీటీ సబ్ స్ర్కైబ‌ర్ల‌ని టార్గెట్ చేయ‌డం ఖాయం.

అందుకోసం స‌ద‌రు ఓటీటీ సంస్థ‌లు ప్రిమియ‌ర్ల రూపంలో 'ఆర్ ఆర్ ఆర్' ని షేక్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. 'ఆర్ ఆర్ ఆర్' ఓటీటీ రిలీజ్ తో కొత్త స‌బ్ స్కైబ‌ర్లు మ‌రింత‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంది.

అన్ని భాష‌ల నుంచి స‌ద‌రు ఓటీటీల‌కు మంచి రెస్పాన్స్ ఉంటుంద‌న్న‌ది నిపుణుల మాట‌. అయితే ఓటీటీ రిలీజ్ కి ఇక్క‌డ మ‌రో ప్ర‌తికూల అంశం ఒక‌టుంది. సాధార‌ణంగా థియేట్రిక‌ల్ రిలీజ్ అయిన నాలుగు లేదా ఆరు వారాల‌కి ఓటీటీలో రిలీజ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

కానీ 'ఆర్ ఆర్ ఆర్' విష‌యంలో 10 వారాల పాటు ఓటీటీ రిలీజ్ కి ఆస్కారం లేదని స‌మాచారం. థియేట‌ర్ లో లాంగ్ ర‌న్ మొత్తం పూర్త‌వ్వ‌డానికి జ‌క్క‌న్న టార్గెట్ గా మూడు నెల‌లు పెట్టుకున్న‌ట్లు స‌మాచారం. ఆ ప్రాతిప‌దిక‌నే రాజ‌మౌళి ఓటీటీల‌తో ఒప్పందం చేసుకున్నట్లు వినికిడి. కాబ‌ట్టి 'ఆర్ ఆర్ ఆర్' ఓటీటీలో రిలీజ్ అవ్వాలంటే చాలా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. అప్ప‌టివ‌ర‌కూ ఓటీటీ వీక్ష‌కులు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.