Begin typing your search above and press return to search.
'ఆచార్య' ఆగమనం ఎప్పుడో..!
By: Tupaki Desk | 14 Jun 2021 4:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ''ఆచార్య''. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సామాజిక అంశాలకు తనదైన శైలిలో కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 'భరత్ అనే నేను' తర్వాత మరో సినిమా కమిటవ్వని కొరటాల.. అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ మీదే వర్క్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పలు కారణాలతో లేట్ అవుతూ వచ్చింది.
ఫైనల్ గా సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం లేకపోతే ఈ పాటికే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తవ్వగా.. మరో 10 రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని ఇటీవల కొరటాల వెల్లడించారు. పరిస్థితులు చక్కబడిన వెంటనే తిరిగి షూటింగ్ ప్రారంభించాలని చూస్తున్నారు. సమ్మర్ రిలీజ్ వదులుకుంది కాబట్టి.. ఈ చిత్రానికి తదుపరి మంచి సీజన్ అంటే దసరా అనే చెప్పాలి. కానీ అప్పటికైనా సినిమా రెడీ అవుతుందా లేదా అని ఫిలిం సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు.
'ఆచార్య' సినిమా మిగిలిన షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయడానికి చాలా సమయమే పట్టే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇదే కనుక జరిగి ఇంకాస్త లేట్ అయితే మాత్రం 'ఆచార్య' వచ్చే ఏడాది సంక్రాంతి ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఫెస్టివల్ స్లాట్ బుక్ చేసుకున్న మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ లకు అప్పుడు ఇబ్బంది వచ్చి పడుతుంది. వీటితో పాటుగా పలు భారీ బడ్జెట్ సినిమాల విడుదలకు కూడా 'ఆచార్య' అడ్డుపడుతుంది.
ఈ నేపథ్యంలో అక్టోబర్ నాటికి థియేటర్ల పరిస్థితులు కూడా బాగుండే అవకాశం ఉంది కనుక.. 'ఆచార్య' చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విజయదశమి కి విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటే మంచిదని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. మరి అప్పటికి ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతుందో లేదో చూడాలి.