Begin typing your search above and press return to search.

అనౌన్స్ మెంట్ ఎప్పుడు 'వెంకీ మామ' ?

By:  Tupaki Desk   |   2 Dec 2019 11:26 AM GMT
అనౌన్స్ మెంట్ ఎప్పుడు వెంకీ మామ ?
X
ఓ పెద్ద సినిమా ఇదే నెలలో రిలీజ్ అంటూ ఇంత వరకూ డేట్ ప్రకటించకపోవడం ఫ్యాన్స్ ను ఉడికిస్తుంది. వెంకటేష్ , నాగ చైతన్య కాంబినేషన్ లో మల్టీ స్టారర్ గా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ రిలీజ్ అవుతోంది. ఎప్పుడనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే సినిమా రిలీజ్ విషయంలో ఆచి తూచి వ్యవహరించే సురేష్ బాబు ఎందుకో వెంకీ మామ కి సంబంధించి మరీ ఎక్కువ టైం తీసుకుంటూ అటు దగ్గుబాటి ఫ్యాన్స్ ను ఇటు అక్కినేని ఫ్యాన్స్ వెయిటింగ్ మోడ్ లో పెట్టాడు. ఇక సినిమా 13న రిలీజ్ అంటూ ఓ టాక్ వినబడుతుంటే లేదు 25న రిలీజ్ అంటూ మరో వర్గం ప్రచారం చేస్తోంది. ఈ రెండు తేదిలపై ఇంకా క్లారిటీ లేదు.

ఈ రోజు సాయంత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ అంటూ ఓ ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నారు సురేష్ బాబు. ఈ మేరకు మీడియాను ఇన్వైట్ చేసారు కూడా. కట్ చేస్తే వెంటనే మళ్ళీ క్యాన్సెల్ చేసుకున్నారు. ఇక ఈ రోజు సురేష్ బాబు ప్రెస్ మీట్ తో వెంకీ మామ రిలీజ్ డేట్స్ పై క్లారిటీ వస్తుందనుకుంటే మళ్ళీ మొదటి కొచ్చింది. మరి సురేష్ బాబు వెంకీ మామ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేదెప్పుడో ?