Begin typing your search above and press return to search.
ఎర్లీ బర్డ్ కోటాలోకి వచ్చేసిన లవ్ స్టోరీ.. రిలీజ్ ఎప్పుడంటే?
By: Tupaki Desk | 23 Jun 2021 2:30 AM GMTశేఖర్ కమ్ముల సినిమా అంటే దానికో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. అందుకు నాగచైతన్య.. సాయిపల్లవి తోడైతే.. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందన్న ఆత్రుత ఉంటుంది. ఎప్పుడైతే సారంగదరియా సూపర్ డూపర్ హిట్ కావటమే కాదు.. యూట్యూబ్ లో బద్ధలు కొట్టేసిన వ్యూస్ తోనే ఈ సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. తొలుత అనుకున్న ప్రకారం ఏప్రిల్ 16న మూవీ రిలీజ్ అనుకున్నప్పటికి.. అప్పటికే కరోనా సెకండ్ వేవ్ షురూ కావటంతో దాని విడుదల ఆగిపోయింది.
ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతుండటం.. కేసుల సంఖ్య తగ్గిపోవటమే కాదు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే థియేటర్లు ఓపెన్ చేసుకోవటానికి అనుమతి ఇచ్చేసింది కూడా. అయినప్పటికీ థియేటర్లు ఓపెన్ కాలేదు. దీనికి కారణంగా ఏపీలో థియేటర్లు బంద్ పెట్టి ఉండటమే. తెలుగు సినిమా ఏదైనా సరే.. రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లు లాంటివి. అలాంటిది ఒక కంటితో చూడటం ఎంత కష్టమో తెలుసిందే. అందుకే.. ఏపీలో కూడా థియేటర్లు ఓపెన్ అయ్యే వరకు థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు.
ఏపీలో థియేటర్లు ఓపెన్ అయినా.. బెంగళూరులో థియేటర్లు తెరిచే వరకు కొన్ని క్రేజీ సినిమాలు విడుదలయ్యే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే.. థియేటర్లు ఓపెన్ అయిన వెంటనే సినిమాలు పోటెత్తే అవకాశం ఉండటంతో.. తమ సినిమాలకు చోటుకల్పించాల్సిందే కొందరు నిర్మాతలు ఇప్పుడుప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడా రేసులోకి లవ్ స్టోరీ వచ్చేసింది. నాగచైతన్య.. సాయి పల్లవి నటించిన ఈ సినిమాను థియేటర్లు తెరిచిన వారానికే విడుదలకు సిద్ధం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.
థియేటర్లు తెరిచినంతనే వచ్చే ఎర్టీబర్డ్ సినిమాల్లో లవ్ స్టోరీ తప్పక ఉంటుందన్న మాట వినిపిస్తోంది. ఇందుకు నిర్మాత కూడా సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. లవ్ స్టోరీ లాంటి క్రేజీ మూవీ విడుదల చేయటం ద్వారా.. థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించొచ్చని.. అలా పూర్వవైభవానికి తమ సినిమా కచ్ఛితంగా సాయం చేస్తుందన్న నమ్మకంతో నిర్మాతలు ఉన్నారు. దీనికి తోడు చిత్రనిర్మాత చేతిలోభారీగా థియేటర్లు ఉండటంతో ఈ మూవీ ఎర్లీ బర్డ్ లిస్టులో చేరినట్లుగా సమాచారం.