Begin typing your search above and press return to search.

రవితేజ రావణాసుర.. ఎంతవరకు వచ్చిందంటే?

By:  Tupaki Desk   |   28 Dec 2022 8:30 AM GMT
రవితేజ రావణాసుర.. ఎంతవరకు వచ్చిందంటే?
X
మాస్ మహారాజ రవితేజ రెండు డిజాస్టర్స్ తరువాత మళ్ళీ ధమాకా సినిమాతో ఫామ్ లోకి వచ్చేసాడు. ఈ సినిమాకు మొదట కొంత నెగిటివ్ టాక్ అయితే వచ్చినప్పటికీ ఫెస్టివల్ సీజన్ ను మాత్రం బాగానే ఉపయోగించుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడి దాదాపు మొత్తం వెనక్కి వచ్చింది. ఎదేమైనా మాస్ మహారాజ్ ఖిలాడి, రామారావు సినిమాల తర్వాత మళ్లీ సక్సెస్ అందుకొని ఫామ్ లోకి వచ్చేసాడు.

ఇక తన నుంచి నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో నటించిన వాల్తేరు వీరయ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అందులో అతని పాత్ర టైమింగ్ కూడా ఎక్కువగానే ఉండడంతో సక్సెస్ అయితే మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఇక రవితేజ తదుపరి సినిమాల విషయంలో కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అతను లైన్ లో పెట్టిన సినిమాలలో రావణాసుర కూడా డిఫరెంట్ గా తెరకెక్కుతోంది.

ఆ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అతను విభిన్నమైన గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ విషయంలో మాత్రం చిత్ర యూనిట్ సభ్యులు పెద్దగా క్లారిటీ ఇవ్వడం లేదు. వెంట వెంటనే రవితేజ సినిమాల హడావిడి ఉండడంతో ఈ సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ ఇప్పట్లో మొదలు పెట్టాలని అనుకోవడం లేదట.

వాల్తేరు వీరయ్య తర్వాతే వరుస ప్రమోషన్స్ మొదలయ్యే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతానికి అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా రవితేజకు సంబంధించిన షూటింగ్ పార్ట్ అయితే అయిపోయిందట. కేవలం కొన్ని సాంగ్స్ కు సంబంధించిన షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇక త్వరగా మిగిలిన పనులను పూర్తి చేసుకొని సినిమాను 2023 సమ్మర్ కు థియేటర్స్ లోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు స్వామి రారా, కేశవ సినిమాలతో సక్సెస్ అందుకున్న సుధీర్ ఆ తర్వాత రణరంగం సినిమాతో మరో పెద్ద డిజాస్టర్ అందుకున్నాడు.

అయితే కొన్ని వివాదాలు వలన షాకిని డాకిని సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనలేదు. ఇక ఇప్పుడు రవితేజతో రావణాసుర సినిమాతో సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.