Begin typing your search above and press return to search.

థియేటర్ల‌కు వంద శాతం మోక్షం ఎప్పుడంటే?

By:  Tupaki Desk   |   8 Aug 2021 10:30 AM GMT
థియేటర్ల‌కు వంద శాతం మోక్షం ఎప్పుడంటే?
X
నిశ్చ‌లంగా ఉన్న త‌టాకంలో రాయి విసిరిన చందంగా టిక్కెట్టుపై ఏపీ స‌ర్కార్ తెచ్చిన‌ జీవో ఊహించ‌ని ప్ర‌కంప‌నాల‌కు కార‌ణ‌మైంది. అనూహ్యంగా టిక్కెట్టు ధ‌ర‌ల్ని భారీగా త‌గ్గించేయ‌డంతో ఎగ్జిబిట‌ర్లు ఖంగు తిన్నారు. ఏపీలో త‌గ్గుద‌ల తెలంగాణ నిర్మాత‌లు పంపిణీ వ‌ర్గాల‌కు కూడా ఇబ్బందిక‌రం. ఈ ధ‌ర‌ల‌తో క‌నీస మెయింటెనెన్స్ అయినా క‌ష్ట‌మే అంటూ ఆవేద‌న చెందారు. ఇక తెలంగాణ‌లో పార్కింగ్ ఫీజు కూడా అప్ప‌ట్లో అంతే క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇక్క‌డ సింగిల్ థియేట‌ర్ల‌కు పార్కింగ్ ఫీజు వెసులుబాటును క‌ల్పిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం ఆర్డ‌ర్స్ జారీ చేసినా అక్క‌డ టిక్కెట్టు పెంపుపై ఏపీ ప్ర‌భుత్వం దిగి రావ‌డం లేదు. దీంతో అస‌లు థియేట‌ర్లు తెర‌వాలా వ‌ద్దా? అన్న సందిగ్ధంలో ప‌డిపోయారంతా.

కానీ ఏపీలో వంద‌శాతం థియేట‌ర్ల‌ను తెరిచేందుకు స‌న్నాహాలు సాగుతున్నాయి. అన్ని థియేటర్లు ఆగస్టు 13 నుంచి తెరుస్తార‌ని తాజాఆ రివీలైంది. మహమ్మారి భ‌యాల న‌డుమ‌ తెలుగు సినిమా పరిశ్రమకు మంచి రోజులు రావాల‌ని కోరుకున్న వారి క‌ల‌లు ఫ‌లిస్తాయ‌ని తాజాగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తెలంగాణ‌లో వంద‌శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు ర‌న్ అవుతున్నాయి. రెండు వారాల తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వంద‌శాతంతో బొమ్మ ఆడిస్తాయ‌ట‌. ఆంధ్రప్రదేశ్ లోని థియేటర్లు జూలై 30 నుండి సినిమాలను ప్రదర్శిస్తున్నా.. 50శాతం ఆక్యుపెన్సీ తో పరిమిత స్క్రీన్ లు మాత్రమే ఓపెన‌య్యాయి. ఆగస్టు 13 నుండి రాష్ట్రంలోని అన్ని థియేటర్లు వంద శాతంతో ఓపెన‌వుతాయ‌ట‌.

కార‌ణం ఏదైనా దీని వ‌ల్ల నాని- ట‌క్ జ‌గ‌దీష్.. రానా - విరాఠఫ‌ర్వం రిలీజ్ ల‌కు ఆటంకాలు తొల‌గిన‌ట్టేన‌ని భావిస్తున్నారు. నాగ చైతన్య- క‌మ్ముల ల‌వ్ స్టోరీని కూడా థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసేందుకే వేచి చూస్తున్నారు. అధికారికంగా రిలీజ్ తేదీని ప్ర‌క‌టించాల్సి ఉంది. మ‌రోవైపు విశ్వక్ సేన్ నటించిన పాగల్ చిత్రం ఆగస్టు 14 న థియేటర్లలోకి రానుంది. నిజానికి ఇవ‌న్నీ ఓటీటీల్లో రిలీజ్ కావాల్సిన‌వేన‌న్న టాక్ ఉంది. కానీ థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసే సాహ‌సం చేస్తార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.