Begin typing your search above and press return to search.
చేతినిండా సంపాదించే యాంకర్లు.. విరాళం ఊసు లేదు ఏంటి ?
By: Tupaki Desk | 3 April 2020 8:30 AM GMTకరోనా కారణంగా ప్రపంచమంతా వణికిపోతోంది. ఆ పేరు చెప్తే చాలు.. జనాలకు నిద్ర కూడా పట్టడం లేదు. ఇప్పటికే చాలామంది ఉపాధి కోల్పోయారు. చాలామంది జీతాలలో కోతలు పడ్డాయి. డబ్బు ఉన్నవారి సంగతి.. సరుకులు ఇంటినిండా తెచ్చిపెట్టుకున్న వారి సంగతి సరే కానీ మిగతావారి సంగతి ఏంటి? అందరినీ ఆదుకోవడం ప్రభుత్వానికి ప్రాక్టికల్ గా సాధ్యం కాదు అనేది అందరూ ఒప్పుకునే విషయం. అందుకే డబ్బున్న వారు.. కార్పొరేట్ కంపెనీలు.. పలువురు సెలబ్రిటీలు తమ వంతు విరాళాలు ప్రకటిస్తూ కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి సాయంగా నిలుస్తున్నారు.
మునుపటిలా కాకుండా ప్రజలు, నెటిజన్లు కూడా సెలబ్రిటీలు తప్పనిసరిగా తమ సామాజిక బాధ్యతను నిర్వర్తించాలని.. తమ వంతు సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు రు విరాళాలు అందించని సెలబ్రిటీల లిస్టు తీసి మరీ వారిని.. “ఎప్పుడు ఇస్తారు.. ఎంత ఇస్తారు.. అసలు ఇస్తారా లేదా?”.. అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. పెద్ద పెద్ద స్టార్ లకే ఈ ప్రశ్నలు తప్పడం లేదు. ఈ ఒత్తిడికి కొందరు తలవంచి విరాళాలు ప్రకటిస్తున్నారు. దీంతో ప్రజలు నెటిజన్లు కూడా ఇతరులపై ఒత్తిడి పెంచుతున్నారు. స్టార్ల సంగతి సరే.. టీవీ లో కూడా లక్షల కొద్దీ.. కోట్లకొద్దీ డబ్బు సంపాదించే యాంకర్లకు.. హోస్ట్ లకు.. నటీ నటులకు ఇవే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. భారీగా సంపాదించే వీరందరూ ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు చేస్తున్నారు అనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఈమధ్య ఒకరిద్దరు టాప్ యాంకర్ లు మాత్రం తమ వంతు సాయంగా మ్యాగీ.. రైస్.. దాల్ వంటి ఆహార పదార్థాలను.. అవసరమైనవారికి పంపిణీ చేశామని తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. అది నిజంగానే అభినందనీయం. ఆపత్కాలంలో కోట్లు దానం చేయకపోయినా కనీసం నలుగురికి అన్నం పెట్టినా అది గొప్ప విషయమే. మరి మిగతా యాంకర్లు.. టీవీ నటీనటులు ఏం చేస్తున్నట్టు? విరాళాలు అంటే ఎప్పుడూ టాలీవుడ్ స్టార్ లే ఇవ్వాలా.. టాటా బిర్లా లే ఇవ్వాలా? టీవీ నటులు ఇవ్వరా? వారికి సామాజిక బాధ్యత లేదా? ఇవి సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి ఎదురవుతున్న ఘాటు ప్రశ్నలు.