Begin typing your search above and press return to search.
చప్పట్లకు దూరంగా ఉన్న సెలెబ్రిటీలు - కారణం ఇదేనా?
By: Tupaki Desk | 23 March 2020 5:31 AM GMTకరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా తలపెట్టిన జనతా కర్ఫ్యూకు దేశ ప్రజానీకం చప్పట్లతో సంఘీభావం తెలిసింది. సాయంత్రం 5 గంటలకు అందరూ ఇంటి గుమ్మం ముందుకు వచ్చి దేశ శ్రేయస్సు కోసం పోరాడుతున్న వైద్యులు, అధికారులు, కార్మికులు, పోలీసులందరికీ కరతాళ ధ్వనులతో తమ మద్దతు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులతో కలిసి చప్పట్లు కొట్టారు. ఇంక సెలెబ్రెటీల మాట చెప్పక్కర్లేదు. టాలీవుడ్ మొత్తం జనతా కర్ఫ్యూకు మద్దతు తెలిపి తమ ఐక్యత చాటుకున్నారు. చిరంజీవి, వెంకటేష్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మొదలయిన టాలీవుడ్ ప్రముఖులంతా చప్పట్లతో తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ వీడియోస్ పోస్ట్ చేసారు.
ఇలాంటి వాటికి ఎప్పుడు దూరంగా ఉండే రవితేజ, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలు చప్పట్లు కొడుతూ కనిపించలేదు. నాగార్జున, అఖిల్, రానా లాంటి వాళ్ళు ట్విట్టర్ లో సంఘీభావం తెలిపినప్పటికీ చప్పట్ల వీడియోలు మాత్రం పోస్టు చేయలేదు. ఇంక హీరోయిన్ల విషయానికొస్తే చాలా మంది దీనికి దూరంగా ఉన్నారనే చెప్పవచ్చు. అయితే అలా వీడియోలు పోస్ట్ చేసిన వాళ్లలో చాలామంది జనాలకి కనిపించి ప్రచారం చేసుకోవాలనుకున్న బ్యాచ్ కూడా ఉన్నారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మరికొందరైతే 'అలా చప్పట్లు కొట్టి వీడియోలు పోస్టు చేస్తే మనకొచ్చేది ఏముంది, మోడీ వచ్చి డబ్బులు ఏమీ ఇవ్వదు కదా' అని దూరంగా ఉన్నవాళ్లు కూడా ఉన్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో దేశం మొత్తం ఇలాంటి సంకటంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు తమ స్వలాభాన్ని ఆశించడం ఏమీ బాలేదని సినీ అభిమానులు కొంతమంది విమర్శిస్తున్నారంట.