Begin typing your search above and press return to search.
కన్నడలో ఎంట్రీ ఇస్తున్న చిరంజీవ విలన్
By: Tupaki Desk | 4 Feb 2019 9:45 AM GMTనటుడిగా నిర్మాతగా తనకంటూ స్వంత ఐడెంటిటీ ఉన్నా సల్మాన్ తమ్ముడు అంటేనే ఫ్లాష్ అయ్యే పేరు అర్బాజ్ ఖాన్. హిందీలో ఎన్ని సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయిన అర్బాజ్ ఖాన్ దబాంగ్ నిర్మాతగా దాని సీక్వెల్ కు దర్శకుడిగా బాగానే సక్సెస్ అయ్యాడు. సౌత్ మీద కూడా మంచి ఆసక్తి చూపించే అర్బాజ్ చాలా ఏళ్ళ క్రితం మెగాస్టార్ జై చిరంజీవ మూవీ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అందులో తుపాకీని టెస్ట్ చేయడానికి చిరు మేనకోడలిని చంపే పాత్రలో విలనిజం బాగానే పండించాడు.
అయితే అది డిజాస్టర్ కావడంతో మనవైపు పెద్దగా ఆఫర్లు రాలేదు. ఆ తర్వాత ఇంకోటి ఏదో చేసాడు కానీ ఎవరూ పట్టించుకోలేదు. అయితే తాజాగా ఓ కన్నడ సినిమా ద్వారా అర్బాజ్ ఖాన్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు అక్కడి స్టార్ హీరో గణేష్ నటిస్తున్న వేరీజ్ కన్నడక అనే సినిమా ద్వారా శాండల్ వుడ్ లో అడుగు పెడుతున్నాడు. పత్రలేఖ హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీని నిజ జీవితంలో దంపతులైన రాజ్-దామినిలు జంటగా డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే కీలక భాగం షూటింగ్ పూర్తయిపోయింది.
సౌత్ లో ఇంతకు ముందే నటించాను కాబట్టి తనకేమి కొత్తగా లేదంటున్న అర్బాజ్ దీని మీద మంచి కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నాడు. మలైకా అరోరాతో విడాకులు తీసుకున్నాక ఒంటరిగా ఉంటున్న అర్బాజ్ ఖాన్ తన మాజీ భార్య బోనీ కపూర్ వారసుడు అర్జున్ కపూర్ తో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతోందన్న వార్తలకు స్పందించడానికి ఇష్టపడటం లేదు. పర్సనల్ గా లైఫ్ మరీ ఇలా మారిపోవడం ఎలా ఉన్నా గత ఏడాది సన్నీ లియోన్ తో ఓ సినిమాలో హీరోగా నటించిన అర్బాజ్ ఖాన్ ఏదో రకంగా ఇలా అవకాశాలతో బిజీగా ఉంటున్నాడు