Begin typing your search above and press return to search.
బాబు జాతిరత్నం ఎక్కడున్నావ్?
By: Tupaki Desk | 19 Aug 2021 11:30 AM GMTఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ తో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ తర్వాత వచ్చిన జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించి కమర్షియల్ హీరోగా పేరు దక్కించుకున్నాడు. మంచి టైమింగ్ ఉన్న నటుడిగా.. ప్రతిభతో పాటు లక్ ఉన్న నటుడిగా నవీన్ పొలిశెట్టిపై ప్రశంసలు కురిపించారు. జాతిరత్నాలు విడుదల అయ్యి నెలలు గడుస్తుంది. ఇప్పటి వరకు ఈయన నుండి తదుపరి సినిమాకు సంబంధించిన అప్ డేట్ లేదు. దర్శకుడు అనుదీప్ జాతిరత్నాలు తర్వాత పాన్ ఇండియా సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటికే ఆయన సినిమాకు సంబంధించిన అధికారిక ప్రటకన వచ్చింది. కాని జాతి రత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు.
ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి పక్కా కమర్షియల్ సక్సెస్ అవుతుంది అనిపించే స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడట. హడావుడిగా సినిమాలు చేయకుండా మెల్లగానే సినిమాలు చేస్తూ కమర్షియల్ సక్సెస్ లను బ్యాక్ టు బ్యాక్ దక్కించుకునే ఉద్దేశ్యంతో నవీన్ తదుపరి సినిమా విషయంలో వెంటనే నిర్ణయాన్ని తీసుకోలేక పోతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్త అవసరం. కాని మరీ ఎక్కువ జాగ్రత్తను పాటించినట్లయితే ఆలస్యం అవుతుందని.. తద్వార వచ్చిన సక్సెస్ క్రేజ్ ను మిస్ చేసుకున్న వాళ్లు అవుతారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి జాతిరత్నాలు సినిమా సక్సెస్ క్రేజ్ ను వినియోగించుకోవాలని వెంటనే సినిమా చేసేందుకు నవీన్ ఆసక్తిగా లేడు.
అనుష్క ప్రధాన పాత్రలో యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న సినిమాలో నవీన్ పొలిశెట్టి కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రారా కృష్ణయ్య సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో విడుదల చేసేలా ఈ సినిమాను చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమా గురించి చాలా నెలలుగా మీడియా వర్గాల్లో ప్రచారం అయితే జరుగుతుంది. కాని ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన అప్డేట్ మాత్రం ఇవ్వడం లేదు. మరి జాతిరత్నం నవీన్ పొలిశెట్టి ఈ ఏడాదిలో కొత్త సినిమా తో రావడం లేదని దాదాపుగా తేలిపోయింది. మరి వచ్చే ఏడాదిలో అయినా నవీన్ కొత్త సినిమా ఉంటుందేమో చూడాలి.