Begin typing your search above and press return to search.
తంబి పవర్ స్టార్ అదృశ్యం.. కారణం ఇదే
By: Tupaki Desk | 8 Dec 2018 2:30 PM GMTతమిళ కమెడియన్ శ్రీనివాసన్ అక్కడ పవర్ స్టార్ గా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఈ మద్య కాలంలో మంచి ఆఫర్లు దక్కించుకున్న శ్రీనివాసన్ మంచి సక్సెస్ లను కూడా దక్కించుకున్నాడు. తమిళంలో బిజీ ఆర్టిస్టు గా కొనసాగుతున్న శ్రీనివాసన్ కనిపించకుండా పోయి ఒక్కసారిగా సంచలనంకు తెర లేపాడు. స్నేహితుడి ఇంటికి వెళ్తున్నాను అంటూ చెప్పిన భర్త ఎంతకు తిరిగి రాకపోవడంతో ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో ఈ విషయం తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది.
శ్రీనివాసన్ ఉన్నట్లుండి ఎటు పోయాడా అంటూ అంతా కూడా అవాక్కయ్యారు. శ్రీనివాసన్ కు చాలా అప్పులు ఉన్నాయి. ఆ అప్పుల బాధ బరించలేక ఎటైనా పారిపోయి ఉంటాడని కొందరు భావించగా, మరి కొందరు మాత్రం అప్పులు ఇచ్చిన వారు ఎవరో ఆయన్ను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని చూస్తున్నారేమో అంటూ అనుమానం వ్యక్తం చేశారు. కొందరు శ్రీనివాసన్ కు అప్పులు ఇచ్చాం అని, ఆయన పేరున ఉన్న ఆస్తులు వెంటనే తమకు రాయాలంటూ కూడా ఫోన్ చేసి బెదిరించారట.
భర్త కనిపించకుండా పోవడంతో పాటు, బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యం లో శ్రీనివాసన్ భార్య పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిందట. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ మొదలు పెట్టకుండానే శ్రీనివాసన్ ఊటిలో ఉన్నట్లుగా సమాచారం అందింది. ఊటిలో ఆయనకు ఉన్న ఒక బిల్డింగ్ ను అమ్మేసి అప్పులు కట్టేందుకు అక్కడకు వెళ్లాడట. ఆ విషయం ఇంట్లో వారికి చెప్పక పోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడినది.