Begin typing your search above and press return to search.
పాన్ ఇండియా బ్యూటీలో ఎక్కడుంది లోపం?
By: Tupaki Desk | 15 July 2022 5:00 AM GMTనేటి జనరేషన్ స్పీడ్ ని అందుకోవడం పాత తరాలకు అంత సులువేమీ కాదు. అల్ట్రా స్పీడ్ టచ్ యుగం ఇది. సోషల్ మీడియాలు డిజిటల్ విప్లవాలను సద్వినియోగం చేసుకుని దూసుకుపోతున్న కొందరితో పోలిస్తే ఇలాంటి వాటికి అంటీ ముట్టనట్టు ఉండే జనరేషన్ పూర్తిగా రేసులో వెనకబడే ఉంది.
చూస్తుంటే శ్రీనిధి శెట్టి ఇదే బాపతు అని అర్థమవుతోంది. కేజీఎఫ్ - కేజీఎఫ్ 2 లాంటి సంచలన విజయాల్లో నటించిన ఈ మాజీ మిస్సు వరుస పెట్టి అగ్రహీరోల సినిమాలకు కమిటవుతుందని భావించారు. అలాగే టాలీవుడ్ శాండల్వుడ్ లోనూ వరసగా సినిమాలకు సంతకాలు చేస్తుందని కూడా అంచనా వేసారు. కానీ తన కెరీర్ అందుకు పూర్తి భిన్నంగా ఉంది.
తన చుట్టూ ఉన్న ఆరా(మాయ)ని కానీ కేజీఎఫ్ తో వచ్చిన హైప్ ని కానీ శ్రీనిధి ఎన్ క్యాష్ చేసుకున్నట్టే కనిపించడం లేదు. నిజానికి అందానికి అందం నట ప్రతిభ తో ఆకట్టుకున్న ఈ బ్యూటీలో లోపం ఎక్కడుంది? అంటే.. కేవలం ప్రణాళికలోనే ఉందన్న వాదన వినిపిస్తోంది.
బ్లాక్ బస్టర్ KGF ఫ్రాంచైజీతో శ్రీనిధి శెట్టికి ఆశించినంత ప్రచారం చేసుకోలేదు. శ్రీనిధి వాస్తవం మరిచి కెరీర్ ఆరంభమే భారీ పారితోషికం డిమాండ్ చేస్తోందని దాంతో చాలా అవకాశాలు మిస్సయ్యాయని కూడా ప్రచారం సాగింది.
సౌత్ నుంచి చాలా ఛాన్సులు వచ్చినా కానీ ఎందుకనో అవన్నీ వదులుకుందని టాక్ వినిపించింది. తను అధిక పారితోషికం డిమాండ్ చేయడంతోనే చెడిపోయిందని గుసగుస వినిపించింది. ప్రస్తుతం చియాన్ విక్రమ్ సరసన నటిస్తున్న కోబ్రాకి శ్రీనిధి 'కేజీఎఫ్' పారితోషికానికి రెట్టింపు డిమాండ్ చేసిందన్న టాక్ కూడా ఉంది.
కారణం ఏదైనా కానీ అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంలో తడబడింది. అలాగే శాండల్వుడ్ తో పాటు ఇరుగు పొరుగు భాషల్లో తనకు పీఆర్ బలంగా ఉందా లేదా? అన్నది తెలియరాలేదు. చాలా మంది కథానాయికలు ఇక్కడ హిట్టు కొట్టగానే ఆ క్రేజ్ తో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. కానీ శ్రీనిధి అలాంటి ప్రయత్నం చేస్తున్నట్టు లేదు. కేజీఎఫ్- కేజీఎఫ్ 2 రెండు భాగాలు కలిపి 700 కోట్ల మేర షేర్ ని వసూలు చేశాయి. అంత పెద్ద బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీలో నటించాక కూడా ఇంకా పెద్ద ఆఫర్లు అందుకోవడంలో తడబడుతోంది. దీని నుంచి శ్రీనిధి ఎలా కంబ్యాక్ అవుతుందో చూడాలి.