Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: సమ్మోహనంగా వెంకటలక్ష్మి!
By: Tupaki Desk | 6 Feb 2019 6:51 AM GMTలక్ష్మి రాయ్ పేరు చెప్పగానే తెలుగు ఆడియన్స్ కు హాట్ బ్యూటీ గుర్తొస్తుంది. ఈ బ్యూటీ ఇప్పుడు 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు ముందుకొస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటలక్ష్మి మాయలో పడే పల్లెటూరి కుర్రాళ్ళ పాత్రల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ మధునందన్.. ప్రవీణ్ లు నటిస్తున్నారు. కాసేపటి క్రితం ఈ సినిమా టీజర్ విడుదలైంది.
ఈ టీజర్ ప్రత్యేకంగా లక్ష్మి రాయ్ కోసం కట్ చేసినట్టుగా ఉంది. తలస్నానం చేసిన తర్వాత అందమైన నలుపు రంగు చీర కట్టుకొని సాంబ్రాణి పొగలో తన జుట్టును వయ్యారంగా ఆరబెట్టుకుంటూ ఉంటే.. సున్నితంగా ఉండే ఆమె అందాలను ఒక్కోభాగం ఫోకస్ చేస్తూ రొమాంటిక్ గా చూపించాడు దర్శకుడు. నడుము ఒంపు దగ్గర మొదలు పెట్టి.. నున్నగా ఉన్న వీపు భాగం దాకా అన్నీ కవర్ చేశాడు గురుడు. బ్యాక్ గ్రౌండ్ లో సీరియల్ లైట్ల వెలుతురు.. తెరలు తెరలుగా వస్తున్న సాంబ్రాణి పొగలో లక్ష్మీ రాయ్ సమ్మోహనంగా పోజులిచ్చింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ అందమైన షాట్స్ కు తగ్గట్టే సున్నితంగా కోమలంగా ఉంది. మరి ఇలాంటి బ్యూటీని..అలాంటి రొమాంటిక్ పోజులను చూసిన తర్వాత సినిమాలో మధునందన్.. ప్రవీణ్ లు వెంటపడకుండా ఎలా ఉంటారు?
పూజిత పొన్నాడ.. జబర్దస్త్ మహేష్ లు కూడా ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. హరి గౌర ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏబీటీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఇంకా ఆలస్యం ఎందుకు.. బ్యూటిఫుల్ వెంకటలక్ష్మిని చూసెయ్యండి బిజీ బాబులూ!