Begin typing your search above and press return to search.
యాత్ర డైరెక్టర్ ఎక్కడ?.. ఏం చేస్తున్నాడు?
By: Tupaki Desk | 18 Jun 2022 4:30 PM GMTవిలేజ్ లో వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నారు మహి వి. రాఘవ్. 'పాఠశాల' మూవీతో దర్శకుడిగా మారి మెగా ఫోన్ పట్టుకున్నారు. అయితే ఈ మూవీ అతనికి ఆశించిన సక్సెస్ ని అందించలేకపోయింది. దీంతో మూడేళ్ల విరామం తీసుకున్న రాఘవ్ ఆ తరువాత తాప్సీ, శ్రీనివాసరెడ్డిల కలయికలో 'ఆనందో బ్రహ్మ' చేశారు. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
అంతే కాకుండా దర్శకుడిగా, ప్రొడ్యూసర్ గా కమర్షియల్ సక్సెస్ ని అందించి భారీ లాభాల్ని తెచ్చిపెట్టింది. ఇదే మూవీని తమిళంలో తమన్నాతో 'పెట్రోమాక్స్'గానూ, బెంగాలీలో 'భూత్ చక్ర ప్రైవేట్ ఎల్ టీ డీ'గానూ, కన్నడలో 'మన్నే మరతాకిడి' గానూ రీమేక్ చేశారు. అన్ని భాషల్లోనూ ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. రెండేళ్ల విరామం తరువాత వైఎస్. రాజశేఖరరెడ్డి జీవిత కథ ఆధారంగా 'యాత్ర' మూవీ చేశారు.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్ పాత్రలో నటించిన ఈ మూవీ ఏపీ ఎన్నికల ముందు విడుదలై వైసీపీకి ప్లస్ గా మారి ఆ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఈ మూవీ విడుదలై దాదాపు నాలుగేళ్లు కావస్తున్నా దర్శకుడు మహి. వి. రాఘవ్ నుంచి మరో సినిమా రాలేదు. టాలీవుడ్ లో పాన్ ఇండియా చిత్రాల జోరు కనిపిస్తున్నా తన నుంచి మరో సినిమా రాకపోవడంతో 'యాత్ర' దర్శకుడు ఎక్కడా? .. ఏం చేస్తున్నారని ఆరా తీస్తున్నారు.
'యాత్ర' సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న మహి వి. రాఘవ్ ఈ మూవీకి సీక్వెల్ చేయాలనే ప్రయత్నాల్లో వున్నారు. గత కొంత కాలంగా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా వున్న ఆయన త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని 'యాత్ర 2' పేరుతో ప్రారంభించి వచ్చే ఏడాది ఎలక్షన్స్ టైమ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దీనికి ముందు ఓ మూవీని పూర్తి చేయబోతున్నారట.
దీన్ని ప్రభాస్ కు సంబంధించిన యువీ క్రియేషన్స్ కి చేయబోతున్నారని, ఈ మూవీని థియేటర్లో రిలీజ్ చేయకుండా డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. 'సిద్దా లోకం ఎలా వుంది నాయనా' అనే టైటిల్ తో ఈ మూవీ వుండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.