Begin typing your search above and press return to search.

ఎక్కడకెళ్లినా ఎన్టీఆర్ ముద్ర పడాల్సిందే..

By:  Tupaki Desk   |   1 Nov 2022 4:18 PM GMT
ఎక్కడకెళ్లినా ఎన్టీఆర్ ముద్ర పడాల్సిందే..
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎక్కడకి వెళ్లినా సరే తన ముద్ర వేసేస్తాడు.. అంతేనా అక్కడ ఉన్న వారందరిని తన అభిమానులుగా మార్చేసుకుంటాడు. మొన్న జపాన్ వెళ్లి అక్కడ జపనీస్ లో మాట్లాడి అక్కడ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశాడు ఎన్టీఆర్.

ఇక ఇప్పుడు కర్ణాటకలో కూడా తన స్పీచ్ తో అక్కడ ఆడియన్స్ హృదయాలను గెలిచాడు. దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక ప్రభుత్వం ఇస్తున్న కర్ణాటక రత్న అవార్డు వేడుకల్లో తారక్ పాల్గొన్నారు. ఈ అవార్డ్ వేడుకకి ఎన్టీఆర్ తో పాటుగా సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా అటెండ్ అయ్యారు.

ఎక్కడ ఉన్నా తన స్పెషాలిటీ చాటడంలో ముందుండే ఎన్టీఆర్. ఈ కార్యక్రమంలో కూడా తన స్పీచ్ తో అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మైక్ అందుకుంటే ఎన్టీఆర్ స్పీచ్ కి అందరు ఫిదా అవ్వాల్సిందే. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కన్నడ భాషలో మాట్లాడటం అది కూడా స్పష్టంగా మాట్లాడటం అందరిని ఆశ్చర్యపరచింది. ఎన్టీఆర్ మదర్ షాలిని కర్ణాటకకు చెందినవారే.. అందుకే తారక్ కి కర్ణాటక మాతృభాష అయ్యింది. ఒక్క కర్ణాటక మాత్రమే కాదు ఏ భాషలో అయినా సరే ఎన్టీఆర్ అనర్గళంగా మాట్లాడుతారు.

పునీత్ రాజ్ కుమార్ కి కర్ణాటక రత్న ఇవ్వడంపై ఎన్టీఆర్ మాట్లాడుతూ.. పునీత్ నవ్వులో ఉండే స్వచ్చత మరెక్కడా చూడలేదు.. అహం, అహంకారాన్ని పక్కన పెట్టి యుద్ధం చేయకుండానే రాజ్యాన్ని జయించిన వ్యక్తి ఆయన. సూపర్ స్టార్ గా.. భర్తగా.. తండ్రిగా.. స్నేహితుడిగా తనదైన ముద్ర వేశారు. పునీత్ కి కర్ణాటక రత్న ఇవ్వడం ఈ పురస్కారానికి ఓ సార్ధకత ఏర్పడిందని అన్నారు.

ఈ కార్యక్రమానికి ఓ నటుడిగా రాలేదు.. అప్పూ స్నేహితుడిగా వచ్చాను. తనని పొరుగు రాష్ట్రానికి చెందిన వాడిగా కాకుండా తమలో ఒకడిగా చూసుకుంటున్న రాజ్ కుమార్ కుటుమ సభ్యులకు తన ధన్యవాదాలు అంటూ తన ప్రసంగంతో మెప్పించారు ఎన్టీఆర్. పునీత్ తో ఎన్టీఆర్ కి ఉన్న ఫ్రెండ్ షిప్ చాలా గొప్పది. పునీత్ సినిమా కోసం ఎన్టీఆర్ కన్నడలో ఒక సాంగ్ కూడా పాడారు. పునీత్ కి కర్ణాటక రత్న కార్యక్రమానికి ఎన్టీఆర్ వచ్చి ఈ ఈవెంట్ కి మరింత వైభవం తెచ్చారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.