Begin typing your search above and press return to search.
మెగా హీరో సినిమా లాభాలు తెచ్చిపెట్టేనా...?
By: Tupaki Desk | 29 Dec 2020 5:30 PM GMTసుప్రీమ్ హీరో సాయి తేజ్ - నభా నటేష్ జంటగా నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రం క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సుబ్బు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని జీ గ్రూప్ వారు థియేట్రికల్ రిలీజ్ చేశారు. కోవిడ్ నేపథ్యంలో ప్రేక్షకులు వస్తారా అనే అనుమానాలను తొలగిస్తూ ‘సోలో బ్రతుకే..’ సినిమా డీసెంట్ కలెక్షన్లు రాబడుతోంది. నిజానికి మెగా హీరో సినిమా కోసం ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ గా నిలబడింది. దీంతో గత కొన్ని నెలలుగా థియేటర్ ఎక్స్ పీరియన్స్ కి దూరమైన సినీ అభిమానులు.. మెగా అభిమానులు ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఆదరించారు. మొత్తానికి ప్రమోటెడ్ హిట్ సినిమాగా 'సోలో బ్రతుకే సో బెటర్' వీకెండ్ బాక్సాఫీస్ గండం దాటేసింది.
50 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీ తో ఈ సినిమా వీకెండ్ కలెక్షన్స్ ని బట్టి ప్రస్తుతానికి బ్రేక్ ఈవెన్ మార్క్ ని చేరుకోగలిగిందని తెలుస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సోమవారం నాటికి సుమారు 10.8 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇది సాయితేజ్ గత సినిమాల మార్కెట్ తో పోలిస్తే చాలా తక్కువే అని చెప్పాలి. ప్రస్తుతానికి బ్రేక్ ఈవెన్ మాత్రమే అయింది కాబట్టి ఈ సినిమాకు లాభాలు రావాలంటే నెక్ట్స్ వీకెండ్ కూడా థియేటర్ లో సినిమా చూడటానికి జనాలు రావాలి. అలానే ఇతర సినిమాలు 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రానికి పోటీగా రాకుండా ఉండాలి. ఇప్పటికే డిజిటల్ రిలీజ్ అయిన 'ఒరేయ్ బుజ్జిగా' చిత్రాన్ని డిసెంబర్ 31న.. నాని 'వి' సినిమాని జనవరి 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అలానే 'షకీలా' 'బొమ్మ అదిరింది' వంటి చిన్న సినిమాలు కూడా జనవరి 1న రిలీజ్ అవుతున్నాయి. మరి సాయి తేజ్ సినిమా వచ్చే వారం కూడా ఆడియన్స్ దృష్టికి ఆకర్షించి లాభాలు తెచ్చుకుంటుందేమో చూడాలి.