Begin typing your search above and press return to search.
మాకు పోటీగా.... ?
By: Tupaki Desk | 12 Oct 2021 9:10 AM GMTమూవీ అర్టిస్ట్ అసోసియేషన్ అన్నది ఇప్పటికి సరిగ్గా పాతికేళ్ళ క్రితం ఏర్పడింది. నాడు వ్యవస్థాపక అధ్యక్షుడిగా మెగాస్టార్ చిరంజీవిని పెద్దలంతా ఎన్నుకున్నారు. అది లగాయితూ చాలా కాలం పాటు ఏకగ్రీవాలే జరిగాయి. ఇక మాకు 2015లో ఫస్ట్ టైమ్ ఎన్నికలు జరిగాయి. ఇప్పటికి నాలుగు సార్లు ఎన్నికలు జరిగితే తాజా ఎన్నికలు తప్ప అన్ని సార్లూ మెగా క్యాంప్ బలపరచిన వారే ప్రెసిడెంట్లుగా అయిన చరిత్ర ఉంది. ఈసారి మాత్రం మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చినా కూడా ప్రకాష్ రాజ్ ఓడిపోయారు. దీంతో ఒక వర్గం బాగా హర్ట్ అవుతోంది అంటున్నారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు అయితే మా మెంబర్ షిప్ కి రాజీనామా చేసేశారు. మా లో జరుగుతున్న పరిణామాలు చూస్తే తనకు భయమేస్తోందని కూడా ఆయన చెప్పారు.
అంతే కాదు, తాను ప్రకాష్ రాజ్ వెంటనే ఉంటానని కూడా చెప్పారు. ఇంకో వైపు మా మెంబర్ షిప్ కి రాజీనామా చేసిన ప్రకాష్ రాజ్ అసలు కధ ఇపుడే మొదలైంది అని అంటున్నారు. తన రాజీనామా వెనక చాలా సంగతులు ఉన్నాయని కూడా చెబుతున్నారు. ఇంకో వైపు మా ఎన్నికల్లో మెగా క్యాంప్ సపోర్ట్ తో నెగ్గిన వారు కూడా రేపో మాపో రాజీనామా చేస్తారు అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఎగ్జిక్యూటివ్ వైఎస్ ప్రెసిడెంట్ గా గెలిచిన శ్రీకాంత్ తనతోనే ఉంటారని విష్ణు చెప్పినా కూడా ఆయన మెగా ఫ్యామిలీకి ఇష్టుడు అన్నది ఇక్కడ గుర్తించాలి.
ఇవన్నీ ఇలా ఉంటే మా నుంచి రాజీనామాలు చేసిన వారు ఏం చేస్తారు అంటే దాని మీదనే మరో ప్రచారం కూడా సాగుతోంది. మాకు బదులుగా వేరే అసోసియేషన్ ని పెడతారా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. మాలో ఇమడలేని వారు ఓటమిని తట్టుకోలేని వారు అంతా కలసి కొత్త అసోసియేషన్ పెడతారు అన్న ప్రచారమే కనుక నిజమైతే నాగబాబు చెప్పినట్లుగా మా లో చీలిక నిట్ట నిలువునా జరిగినట్లే అనుకోవాలి. మరి ఇలాంటి సంక్లిష్ట సమయంలో ప్రెసిడెంట్ అయిన మంచు విష్ణు వీటిని సవాల్ గానే తీసుకోవాలి. ఆయన ఎన్నికల తరువాత తాను అందరి వాడిని అనిపించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే సినీ పెద్దగా మోహన్ బాబు కూడా ఇపుడు కీలకమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. మాలో చీలికలు లేకుండా అంతా ఒక్కటిగా అడుగులు ముందుకు వేయాలంటే దానికి సినీ పెద్దలంతా కలసి చర్చించుకోవాలి. కొందరు పెద్దలు కొన్ని మెట్లు దిగి రావాలి. అలా జరగాలనే టాలీవుడ్ లోని కళాకారులంతా కోరుకుంటున్నారు.