Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ తర్వాత ఫస్ట్ ఏ సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి...?
By: Tupaki Desk | 25 April 2020 1:30 AM GMTకరోనా వైరస్ ప్రభావం వల్ల దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో మల్టీ ఫ్లెక్సులు, థియేటర్స్ మూసివేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న చిత్రాలు తమ షూటింగ్ లను నిలుపుదల చేసుకోగా.. విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు తమ రిలీజ్ డేట్స్ పోస్టుపోన్ చేసుకున్నాయి. ఇప్పుడు ముందుగా 21రోజులు విధించిన లాక్ డౌన్ ఇప్పుడు మే నెల దాకా పొడిగించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడప్పుడే థియేటర్లు తెరుచుకునేలా కనబడటం లేదు. ఇప్పటికే విడుదల తేదీలను వాయిదా వేసుకున్న సినిమాలు ఇప్పట్లో థియేటర్లలోకి వచ్చేలా కనబడటం లేదు. సాధారణ పరిస్థితుల్లో అయితే సమ్మర్ సీజన్ లో కొత్త కొత్త సినిమాలు సందడి చేస్తూ ఉండేవి. గత నెల రోజులుగా కొత్త సినిమా ఊసే లేదు. ఎప్పుడు ప్రేక్షకులతో కళకళలాడే థియేటర్స్ ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయాయి. ప్రేక్షకుల కిటకిటలతో సందడిగా ఉండే సినిమా హాళ్ళు, మాల్స్ వెలవెలబోతున్నాయి. కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో.. ఎప్పుడు సాధారణ పరిస్థితి వస్తుందో అని సినీ పెద్దలు ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పటికే రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలు థియేటర్ల మీద ఆంక్షలు ఎత్తేసిన వెంటనే సినిమాలు అన్నీ థియేటర్లలోకి రావాలని చూస్తాయి.. దీని వల్ల విడుదల తేదీ విషయంలో నిర్మాతల మధ్య క్లాష్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఒకవేళ లాక్ డౌన్ ఎత్తేసి.. థియేటర్లకు అనుమతులు ఇస్తే ఏం చేయాలన్న విషయంలో తెలుగు నిర్మాతలు ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చేశారట.
ఇప్పటికే రిలీజ్ డేట్లు ప్రకటించుకున్న సినిమాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని గిల్డ్ నిర్ణయించిందట. అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నమాట. మార్చి - ఏప్రిల్ నెలల్లో విడుదల కావాల్సిన చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. థియేటర్లు ఎప్పుడు తెరచుకున్నా సరే ముందు ఆ సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వాలని గిల్డ్ నిర్ణయించిందట. ఇప్పటికే సెన్సార్ అయిన సినిమాలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ తరవాతే మిగిలిన సినిమాల గురించి ఆలోచించాలని వారు భావిస్తున్నారట. అంతేకాకుండా ఒకేసారి రెండు మూడు సినిమాలు రావడం వల్ల నిర్మాతలకే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. అన్నికంటే ముఖ్యంగా లాక్ డౌన్ ఎత్తేసిన ఒకప్పటిలా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో లేదో అని డౌట్. ఇలాంటి సమయంలో ఒకేసారి సినిమాలన్నీ గుంపుగా రావడం కూడా కరెక్ట్ కాదని నిర్ణయించారట. ఈ విషయంపై ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ రిలీజ్ డేట్ల విషయంలో అసలు మాకు సమస్యే లేదు.. లాక్ డౌన్ కంటే ముందే పూర్తయిపోయిన సినిమాలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం.. అయితే సమస్య ఇప్పుడు సినిమాల రిలీజ్ ల గురించి కాదు.. లాక్ డౌన్ ఎత్తేశాక పరిస్థితులు ఎలా ఉంటాయన్న దానిపై ఇప్పుడే అంచనాకు రాలేమని తన అభిప్రాయాన్ని తెలియజేసాడట. మరి లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత సినీ ప్రముఖులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.