Begin typing your search above and press return to search.

ఇద్దరిలో పాన్ ఇండియా క్రేజ్ ను కాపాడుకునేదెవరు..?

By:  Tupaki Desk   |   26 April 2022 3:53 AM GMT
ఇద్దరిలో పాన్ ఇండియా క్రేజ్ ను కాపాడుకునేదెవరు..?
X
ఎస్ఎస్ రాజమౌళి 'బాహుబలి' సినిమాతో వేసిన బాటలో ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ అంతా నడుస్తోంది. ప్రతీ హీరో కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జక్కన్న తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు కూడా లేటెస్టుగా పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చారు.

ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన RRR సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టి.. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియా సినిమా జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.

ఇక ఇందులో అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ పాత్రల్లో నటించిన చరణ్ - తారక్ ల పెర్ఫార్మన్స్ కు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. దీంతో ఇప్పుడు వీరి తదుపరి చిత్రాలపై అందరి దృష్టి పడింది. ట్రిపుల్ ఆర్ సినిమాతో వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ ను ఇద్దరు హీరోల్లో ఎవరు కాపాడుకుంటారనే చర్చ మొదలైంది.

ఎన్టీఆర్ ననెక్స్ట్ సినిమా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఇది తారక్ కెరీర్ లో మైలురాయి 30వ చిత్రం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాని జూన్ లో సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.

#NTR30 అనేది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అంతేకాదు ఇదొక రివేంజ్ డ్రామా. అభిమానులు కోరుకునే హీరోయిజంతో పాటుగా RRR తర్వాత ప్రేక్షకులు ఏమి ఆశిస్తారో అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని తారక్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వచ్చే ఏడాది సమ్మర్ నాటికి ఈ సినిమా రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇదే క్రమంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయనున్నారు. 'కేజీయఫ్' ప్రాంఛైజీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన నీల్.. ఈసారి తారక్ తో కలిసి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. NTR31 తర్వాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబుతో అగ్ర హీరో ఓ మూవీ చేయాలని అనుకుంటున్నారు. ఇది కూడాబహు బాషా చిత్రమేనని తెలుస్తోంది.

మరోవైపు 'ఆచార్య' చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేసిన రామ్ చరణ్.. ప్రస్తుతం సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో #RC15 సినిమా చేస్తున్నారు. ఇదొక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. అలానే పాన్ ఇండియా చిత్రం. దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

దీని తర్వాత 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయనున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇది పాన్ ఇండియా మూవీ. అంతకంటే పెద్దది అవుతుందని కూడా అంటున్నారు. RC16 కు సంబంధించిన వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడి కానున్నాయి. ఇదే క్రమంలో చెర్రీ మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్నారు.

తారక్ - చరణ్ లలైనప్ చూస్తుంటే వేటికవే ప్రత్యేకమైన సినిమాలు.. అది కూడా పాన్ ఇండియా అప్పీల్చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నట్లు అర్థం అవుతోంది. నేషనల్ వైడ్ తమ స్టార్ డమ్ ని కాపాడుకునేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. RRR హీరోలిద్దరూ తమ రాబోయే చిత్రంతో బాక్సాఫీస్ పరంగా సరికొత్త రికార్డులను నెలకొల్పితే మాత్రం.. పాన్ ఇండియా స్టార్స్ గా తమ స్థానాలను సుస్థిరం చేసుకునే ఛాన్స్ ఉంది. ఇద్దరూ తమ క్రేజ్ ను కాపాడుకుంటూ జాతీయ స్థాయిలో సత్తా చాటుతారో లేదో చూడాలి.