Begin typing your search above and press return to search.
ఫిలింక్రిటిక్స్ అంటే ఎవరు?
By: Tupaki Desk | 1 May 2019 4:59 AM GMTటాలీవుడ్ లో ప్రతియేటా 100-200 సినిమాలు రిలీజవుతున్నాయి. వీటన్నిటి భవిష్యత్ ని నిర్ధేశించేది ఫిలింక్రిటిక్స్. ఏ సినిమా హిట్టు.. ఏ సినిమా ఫట్టు!! అని రాసేది.. రిలీజ్ కి ముందే రివ్యూలు రాసి సినిమా జాతకాన్ని తేల్చేది.. ప్రేక్షకుల తరపున నిలిచేది క్రిటిక్స్. ఆయా సినిమాల ప్రచారానికి సంబంధించిన ప్రతి బాధ్యతను నెత్తికెత్తుకునేది క్రిటిక్స్. అయితే ఇటీవలే ఓ పెద్దాయన కం నిర్మాత క్రిటిక్ అంటే ఎవరు? అని తెలియక అడిగారు. 150 మంది జర్నలిస్టులు అంటూ చెబుతుంటారు కదా? ప‌్రెస్ మీట్ లో ఎప్పుడూ కనబడరేం? ఫోటో జర్నలిస్టులు.. వీడియో జర్నలిస్టులు క్రిటిక్స్ కిందే లెక్కనా? అసలు రాసే జర్నలిస్టులు ఎంతమంది అని అడిగారు. అయితే ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమైంది. ఎందుకంటే రాసే జర్నలిస్టులకు అస్సలు అసోసియేషన్ కానీ ప్రత్యేకించి గుర్తింపు కానీ లేనేలేదు. 10-15 ఏళ్ల అనుభవం ఉన్న రిపోర్టర్ కం రైటర్ కం సబ్ ఎడిటర్లు రివ్యూలు రాస్తున్నారు. వీళ్లను రచయితలుగా గుర్తించేది తక్కువే. ఇకపోతే ప్రెస్ మీట్ లో కనిపించకుండా రివ్యూలు రాసి తాట తీసేవాళ్లు ఉంటారు. ఇంగ్లీష్ రివ్యూలు... తెలుగు రివ్యూలు అంటూ చాలానే కథ ఉంటుంది. అలా రాసేవాళ్లంతా బయట కనిపించేది తక్కువే. ఇక బయట గరిట తిప్పే క్రిటిక్స్ కథ పూర్తిగా వేరే ఉంటుందా? అని ఆయన అమాయకంగా అడిగాడు. లేదు సొంతంగా వెబ్ సైట్లు పెట్టుకుని గరిట తిప్పే క్రిటిక్స్ కూడా చాలా మంది ఉన్నారని తెలిసింది అని ఆయనంతట ఆయనే రియలైజై తర్వాత చెప్పాడు. ఇక క్రిటిక్స్ గురించి లోతుగా వెళితే చాలా సంగతులే నిర్మాతలకు తెలుస్తాయి. కానీ వీళ్లు ఎప్పటికీ లోతుగా వెళ్లరు. వెళ్లే ప్రయత్నం చేయరు. ప్రచారం పేరుతో డబ్బును వెదజల్లేస్తున్నాం! అయినా ఎందుకు నెగెటివ్ రివ్యూలొస్తున్నాయి? అంటూ లబోదిబోమనడం తప్ప అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నమే చేయరు పాపం. ఇక దినపత్రికలు వదిలేస్తే.. ఎలక్ట్రానిక్ మీడియా- వెబ్ మీడియా వెల్లువలో తామరతంపరగా ఇప్పుడొస్తున్న యూట్యూబ్ చానెల్ వాళ్లు కూడా క్రిటిక్సే మరి.
అయితే ఈ నిజాల్ని బయటకు తెలియజేసేందుకు.. నిర్మాతల్ని రియలైజ్ చేసేందుకు ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ అనేది ఒకటి ఉండాలి కదా? అందుకే ఇప్పుడు క్రిటిక్స్ అసోసియేషన్ రీయాక్టివేట్ అయ్యింది. దాదాపు 85 ఏళ్ల టాలీవుడ్ హిస్టరీలో 50 ఏళ్ల చరిత్ర ఉన్నది ఈ క్రిటిక్స్ అసోసియేషన్ కే. ఇందులో మద్రాసు పరిశ్రమతో అనుబంధం ఉన్న జర్నలిస్టులు ఎందరో ఉన్నారు. అయితే 10-15 ఏళ్లుగా పని చేస్తున్న యువ సినీజర్నలిస్టులకు ఇందులో మెంబర్ షిప్ ఇవ్వకుండా తాత్సారం చేయడంతో అసలు క్రిటిక్స్ అనేవాళ్లకు అసలు ఒక రూపురేఖ అన్నది లేకుండా పోయింది. ఎవరొచ్చినా క్రిటిక్ అనే చెప్పుకుని తిరిగేస్తున్నారు ఇక్కడ. ఇక దినపత్రికలు .. మ్యాగజైన్లలో పని చేసేవాళ్లకు వెబ్ మాధ్యమం వచ్చాక ప్రాధాన్యత ప్రశ్నార్థకమైంది. అయితే ఇలా పనిచేసే పలువురు సీనియర్లు తమకు గుర్తింపు దక్కకపోవడంపైనా గుర్రుమీదున్నారు. వీళ్లంతా ఫ్రీల్యాన్సర్లుగానూ వెబ్- యూట్యూబ్ లోనూ జోరుమీద ఉన్నవాళ్లున్నారు.
ఇంతకీ ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ రీయాక్టివేట్ అంటూ ఇటీవలే కొత్త కమిటీని ప్రకటించారు. ఈ కమిటీ మునుముందు ఎలాంటి యాక్టివిటీస్ చేపట్టనుంది? అంటూ సినీమీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే కొత్త కమిటీ జెట్ స్పీడ్ తో యాక్టివిటీస్ ని స్టార్ట్ చేసిందని ప్రాక్టికల్ గా అర్థమవుతోంది. ఇప్పటికే ఈ అసోసియేషన్ కి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మద్ధతు పలికారు. అలాగే పలువురు స్టార్ హీరోల్ని.. దర్శకనిర్మాతల్ని టైమింగ్ లీ ఈ కమిటీ సభ్యులు కలుస్తూ ఉనికిని చాటుతున్నారు. మునుముందు ఇండస్ట్రీ బిగ్ బీలందరినీ కలవబోతున్నారు. అంతేకాదు.. ఈ అసోసియేషన్ ప్రారంభోత్సవం రోజున లక్ష విరాళం ప్రకటించిన అధ్యక్షుడు `సంతోషం` సురేష్ కొండేటి మునుముందు వ్యవస్థాగతంగా బలోపేతం చేసేందుకు సన్నాహాలు చేస్తుండడం చర్చకొచ్చింది. ఇప్పటికే ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ కి 30 లక్షల నిధి ఉందని తెలుస్తోంది. నేడు(మే 31) సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్లానెట్ 10లోని ఆయన స్వగృహంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సురేష్ కొండేటి- ప్రధాన కార్యదర్శి ఇ. జనార్ధన్ రెడ్డి- ఉపాధ్యక్షుడు సజ్జా వాసు- కార్యవర్గసభ్యుడు పి.మురళి పాల్గొన్నారు. 30ఏళ్లుగా సినీజర్నలిజంలో అనుభవం ఉన్న వీళ్లకు బయట రెస్పాన్స్ అంతే ఇదిగా కనిపిస్తోంది. ఇక ఫిలింక్రిటిక్స్ జోరుపైనా సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. రెండేళ్ల కోసారి ఎలక్షన్ ప్లాన్ ని ప్రకటించారు. ఇక యువ జర్నలిస్టులకు సంఘంలో స్థానం కల్పించి ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు మునుముందు చేపట్టనున్నారని తెలుస్తోంది. అలాగే రాసేవాళ్లు ఎవరు? రాయని వాళ్లు ఎవరు? అన్నది కూడా పర్టిక్యులర్ గా ఐడెంటిఫై చేసే కార్యక్రమం మునుముందు ఉందని తెలుస్తోంది. మునుముందు అసలు ఫిలింక్రిటిక్స్ అంటే ఎవరు? అని ప్రశ్నించిన ఆ పెద్దాయనకు సమాధానం దొరుకుతుందేమో? దొరకాలనే కోరుకుందాం.