Begin typing your search above and press return to search.

చిరుపై విష ప్ర‌యోగం.. చేసింది ఎవ‌రు?

By:  Tupaki Desk   |   12 Jan 2023 10:32 AM GMT
చిరుపై విష ప్ర‌యోగం.. చేసింది ఎవ‌రు?
X
మెగాస్టార్ చిరంజీవిపై విష‌య ప్ర‌యోగం జ‌రిగిందా?. ఇంత‌కీ ఆ ప్ర‌యోగం చేసింది ఎవ‌రు?.. ఎందుకు చేశారు? .. ఏం ఆశించి చేశారు? అన్న‌ది చాలా కాలంగా వినిపిస్తూ వ‌స్తోంది. అయితే దీనిపై తాజాగా చిరంజీవి స్పందించారు. విష‌య ప్రయోగం త‌న‌పై జ‌రిగిన మాట వాస్త‌మేన‌ని తేల్చి చెప్పారు. అది ఎందుకు జ‌రిగింది?.. ఎలా జ‌రిగింది?.. ఎప్పుడు.. ఏ సినిమా షూటింగ్ స‌మ‌యంలో జ‌రిగిందో ఫుల్ క్లారిటీ చిరంజీవి తాజాగా వెల్ల‌డించ‌డంతో అంతా అవాక్క‌వుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన లేటెస్ట్ యాక్ష‌న్ డ్రామా 'వాల్తేరు వీర‌య్య‌'. బాబి డైరెక్ట్ చేసిన ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీ సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న మ‌రి కొన్ని గంట‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా ప‌లు మీడియా సంస్థ‌ల‌తో చిరంజీవి ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా త‌న‌పై జ‌రిగిన విష‌య ప్ర‌యోగం గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

'మ‌ర‌ణ మృదంగం' సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఓ అభిమాని చేసిన ప‌ని త‌న ప్రాణాల మీద‌కు తెచ్చింద‌న్నారు. షూటింగ్ గ్యాప్ లో ఓ అభిమాని కేక్ తీసుకొచ్చి బ‌ల‌వంతంగా నా నోట్లో పెట్టార‌ని, చేదుగా అనిపించ‌డంతో వెంట‌నే తిన‌కుండా ప‌డేశాన‌ని తెలిపారు.

ఆ విష‌యాన్ని సెట్లో వున్న‌వారికి చెప్ప‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింద‌ని చిరు చెప్పుకొచ్చారు. విష‌యం తెలుసుకున్న సిబ్బంది అత‌న్ని ప‌ట్టుకుని నాలుగు త‌న్న‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టాడట‌.

త‌న‌ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, అత‌ని ప్రాంతానికి చెందిన మ‌రో వ్య‌క్తితో తాను స‌న్నిహితంగా వుంటున్నాన‌ని గ్ర‌హించి కేర‌ళ వెళ్లి వ‌శీక‌ర‌ణ మందుని తీసుకొచ్చి త‌న‌కు తినిపించాల‌నుకున్నాడ‌ని, ఆ విష‌యం తెలిసి సెట్ లో వున్న వాళ్లంతా ఒక్క‌సారిగా అవాక్క‌య్యార‌ని తెలిపారు చిరంజీవి. ఇది స్వ‌యంగా త‌న‌ని అభిమానించే అభిమాని చేశాడ‌న్నారు. చిరు మాట్లాడుతూ 'ఓ అభిమాని నాపై విష ప్ర‌యోగం చేసిన మాట వాస్త‌వం.

'మ‌ర‌ణ మృదంగం' షూటింగ్ లో కేక్ క‌ట్ చేశాం. ఆ స‌మ‌యంలో అత‌ను చేత్తో నాకు కేక్ తినిపించాడు. స్పూన్ లేకుండా తిన‌డం నాకు అల‌వాటు. అయితే త‌ను తినిపించిన కేక్ చేదుగా అనిపించ‌డంతో ప‌డేశాను. విష‌యం తెలిసిన కె.ఎస్‌. రామారావు అత‌న్ని ప‌ట్టుకుని కొట్టడంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టాడు. త‌న‌తో నేను మాట్లాడ‌టం లేద‌ని అలా చేశాన‌ని చెప్పాడు. కేర‌ళ నుంచి వ‌శీక‌ర‌ణ పౌడ‌ర్ తీసుకొచ్చి క‌లిపి న‌ట్టు చెప్పాడు. అది విని అత‌న్ని క్ష‌మించి వ‌దిలేశాను' అన్నారు చిరంజీవి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.