Begin typing your search above and press return to search.

ఇంత‌కీ మెహ్రీన్ టార్గెట్ చేసింది ఎవ‌రిని?

By:  Tupaki Desk   |   5 July 2021 3:30 PM GMT
ఇంత‌కీ మెహ్రీన్ టార్గెట్ చేసింది ఎవ‌రిని?
X
మెహ్రీన్ పిర్జదా రాజ‌కీయ కుటుంబీకుడైన భ‌వ్య‌ బిష్ణోయ్ ని పెళ్లాడేందుకు సిద్ధ‌మై అంత‌లోనే విర‌మించుకున్న సంగ‌తి తెలిసిందే. కేవ‌లం నాలుగు నెల‌ల వ్య‌వధిలోనే ఆ ఇద్ద‌రూ విడిపోవ‌డం అభిమానుల్ని క‌న్ఫ్యూజ్ చేస్తోంది. ఇటీవ‌లే నిశ్చితార్థం ర‌ద్దు నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించి మెహ్రీన్ షాకిచ్చింది. అయితే ఈ జంట విడిపోవడానికి కారణాల‌ను వెల్లడించలేదు. పెళ్లి త‌ర్వాతా మెహ్రీన్ తన నట వృత్తిని కొనసాగించాలనే ఆసక్తితో ఉన్నార‌ని బిష్ణోయితో విభేదాలకు కారణం ఇదేనంటూ మీడియా ప్ర‌చారం సాగిస్తోంది. ఒక ర‌కంగా ఈ కార‌ణం అభిమానుల్లో పాజిటివ్ వైబ్స్ నే రాజేసింద‌ని చెప్పాలి. మ‌రోవైపు త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే శిక్ష త‌ప్ప‌ద‌ని బిష్ణోయ్ మీడియాకి వార్నింగ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఓ అంద‌మైన ఫోటోని షేర్ చేసి దానికి న‌ర్మ‌గ‌ర్భ‌మైన వ్యాఖ్య‌ను మెహ్రీన్ జోడించింది. ``నా విలువ నాకు తెలుసు. నేను నా శక్తిని స్వీకరిస్తాను. నేను అందంగా ఉన్నానని చెప్తాను. నేను బలంగా ఉంటే ఉన్నాన‌ని చెప్తాను. మీరు నా కథను నిర్ణయించలేరు. నేనే నిర్ణ‌యిస్తాను`` అంటూ కోట్ చేసింది. ఈ కోట్ ఒకరిని పరోక్షంగా వేరొక‌రిని కొట్టినట్లు అనిపిస్తుంది కానీ మెహ్రీన్ ఎవరి గురించి కూడా ప్రస్తావించలేదు.

పెళ్లి ర‌ద్ద‌య్యాక అలాంటి న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌ల్ని చేయ‌డం ద్వారా మెహ్రీన్ ఏం చెప్ప‌ద‌లిచారు? అన్న‌ది సందిగ్ధంగా మారింది. మెహ్రీన్ పూల డిజైన్ టాప్ తెలుపు ప్యాంటు లో ఎంతో అందంగా క‌నిపిస్తోంది. ప్రస్తుతం అనిల్ రవిపుడి దర్శకత్వంలో ఎఫ్ 3లో న‌టిస్తున్న మెహ్రీన్ త‌దుప‌రి మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.