Begin typing your search above and press return to search.
#MAA వార్.. అతడి వెనక కథ నడిపిస్తున్న ఘోస్ట్!
By: Tupaki Desk | 6 Sep 2021 3:30 PM GMTMAA ఎన్నికలలో మెలో డ్రామా సర్వత్రా ఆసక్తికర చర్చకు తావిస్తోంది. అక్టోబర్ 10న ఎన్నికల నిర్వహణకు సర్వం సన్నద్ధమవుతున్న వేళ ఇవి సాధారణ ఎన్నికల్లా రకరకాల ట్విస్టులతో వేడెక్కిస్తున్నాయి. తాజాగా ప్రకాష్ రాజ్ బృందానికి షాకిస్తూ బండ్ల గణేష్ ఆ ప్యానెల్ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. అలాగే జనరల్ సెక్రటరీగా తాను స్వతంత్రుడిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.. జీవిత రాజశేఖర్ పై పోటీకి నిలబడి గెలుస్తానని అన్నారు.
జీవిత రాజశేఖర్ ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో చేరడంతో తాను చాలా బాధపడ్డానని గణేష్ వెల్లడించారు. జీవిత ఆమె భర్త హీరో రాజశేఖర్ గతంలో అనేక సందర్భాలలో తన దైవాలు అయిన చిరంజీవి- పవన్ కళ్యాణ్ ని ఎలా అవమానించారో కూడా గణేష్ వీడియో ప్రూఫ్ లను ట్వీట్టర్లలో షేర్ చేశారు. ఈ వీడియోలు మరోసారి `మా` మెంబర్లలో అభిమానుల్లో చర్చనీయాంశమయ్యాయి. అయితే ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి అర్హుడని అతడు పోటీ చేయడం సరైనదేనని బండ్ల ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో డిప్లమాటిక్ గా అనడం తెలిసినదే.
ఒకసారి ఫ్లాష్ బ్యాక్ కి వెళితే జీవిత రాజశేఖర్ తరహాలోనే ప్రకాష్ రాజ్ కూడా తన ఇష్టదైవం అయిన పవన్ కల్యాణ్ ని విమర్శించారు. ఇదివరకూ పవన్ కళ్యాణ్ రాజకీయ సిద్ధాంతాన్ని బిజెపితో ఉన్న అనుబంధాన్ని క్రిటిసైజ్ చేశారు. ఇలాంటి రకరకాల కారణాలతో బండ్ల గణేష్ వెనక ఒక షాడో ఉండి ఇలా చేయిస్తోందన్న గుసగుస కూడా వినిపిస్తోంది. ఇంతకీ బండ్ల వెనక ఉన్న ఆ షాడో ఎవరై ఉంటారు? అంటే ఎవరికి వారు ఊహించుకోవచ్చు. ఇంతకీ ఎవరా ఘోస్ట్ కం షాడో! అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.