Begin typing your search above and press return to search.

పూరీ బుట్టలో పడే నెక్స్ట్ హీరో ఎవరు..?

By:  Tupaki Desk   |   18 Oct 2022 10:39 AM GMT
పూరీ బుట్టలో పడే నెక్స్ట్ హీరో ఎవరు..?
X
టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పూరీ జగన్నాథ్ కు పేరుంది. దాదాపు స్టార్ హీరోలందరితో వర్క్ చేసిన పూరీ.. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ - సూపర్ హిట్లు అందుకున్నాడు. అయితే గత కొంతకాలంగా దర్శకుడికి ఏదీ కలిసి రావడం లేదు. ఒకప్పుడు తమతో సినిమా చేయమని వెంటబడ్డ హీరోలు సైతం.. ఇప్పుడు మొహం చాటేసే పరిస్థితి వచ్చింది.

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ''లైగర్'' చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. దీంతో పూరీ ఎన్నడూ లేనంత నెగెటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఒక అద్భుతమైన చిత్రంతో అందరినీ ఆశ్చర్యపరుస్తారని అందరూ అనుకుంటే.. పూరీ జగన్నాథ్ ఒక చెత్త సినిమాతో వచ్చాడని ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్టార్ హీరోలే కాదు.. మీడియం రేంజ్ హీరోలు కూడా పూరీతో సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదనే టాక్ వినిపిస్తోంది.

వాస్తవానికి 'లైగర్' ప్రేక్షకుల ముందుకు రాకముందే పూరీ - విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో 'జనగణమన' అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకొచ్చారు. అయితే ఆ సినిమాని ప్రస్తుతానికి పూర్తిగా పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. దీంతో దర్శకుడు ఇప్పుడు తన తదుపరి చిత్రంలో నటించే హీరో కోసం వెతుకుతున్నాడు.

నందమూరి బాలకృష్ణ లేదా రామ్ పోతినేని లతో పూరీ జగన్నాథ్ తన తదుపరి చిత్రాన్ని చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. కానీ ఇంకా ఏదీ ఖరారు కాలేదు. అందులోనూ వీరిద్దరూ ప్రస్తుతం 'లైగర్' తర్వాత పెద్ద హీరోలను ఒప్పించడం చాలా కష్టం కాబట్టి... పూరీ యంగ్ హీరోలను ట్రై చేయడం మంచిదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ప్రస్తుతమున్న టాలీవుడ్ కుర్ర హీరోలలో విశ్వక్ సేన్ అయితే పూరీ జగన్నాథ్ సినిమాకు సరిగ్గా సరిపోవచ్చు. అలానే 'డీజే టిల్లు' హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాడు. అక్కినేని హీరోలు నాగచైతన్య మరియు అఖిల్ లను పూరీ ప్రయత్నించవచ్చు. మరి పూరీ ఆ దిశగా ఆలోచిస్తారేమో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.