Begin typing your search above and press return to search.

రాజమౌళి మనసులో ఎవరున్నారు

By:  Tupaki Desk   |   9 April 2019 10:06 AM IST
రాజమౌళి మనసులో ఎవరున్నారు
X
ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఇంకా సగం కూడా పూర్తి కాకుండానే అనూహ్యమైన మలుపులు తిరుగుతోంది. రామ్ చరణ్ కు గాయం కావడం వల్ల ఏకంగా మూడు వారాలు బ్రేక్ పడటం పెద్ద ఎఫెక్ట్ చూపించకపోయినా ముందే చేసుకున్న ప్లానింగ్ వల్ల దానయ్యకు ఎంతోకొంత భారం తప్పదు. ఇది సరిపోదు అన్నట్టు తారక్ కోసం తీసుకున్న డైసి తప్పుకోవడం మరో షాక్. ఇప్పుడు తనను అర్జెంటు గా రీ ప్లేస్ చేయాలి.

నిజానికి చరణ్ పక్కన అలియా భట్ ను తీసుకుని జూనియర్ కు విదేశీ భామను సెట్ చేయడం పట్ల ఫాన్స్ సోషల్ మీడియాలో కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. అది కథ ప్రకారమే అయినప్పటికీ మాస్ మార్కెట్ లెక్కల్లో చాలా విషయాలు ఉంటాయి కాబట్టి అవన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సిందే. అందుకే ఇప్పుడు రాజమౌళి తన ఆలోచనలో మార్పు తెచ్చుకుని యంగ్ టైగర్ కు సైతం బాలీవుడ్ బ్యూటీని సెట్ చేయబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్

ఒకరు సాహోతో తెలుగులో డెబ్యూ చేయబోతున్న శ్రద్ధ కపూర్ కాగా మరొకరు జగదేకసుందరి వారసురాలు జాన్వీ కపూర్. అయితే ఇవి కేవలం పరిశీలనలో ఉన్న పేర్లు మాత్రమేనట. శ్రద్ధా కాల్ షీట్స్ సాహో వల్ల ఇప్పటికే చాలా ఇవ్వాల్సి వచ్చింది. మళ్ళి ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ అంటే ఇంకో ఏడాది త్యాగం చేయాల్సి వస్తుంది. అలా అని తాను అంత ఈజీగా ఇచ్చే పరిస్థితిలో లేదు. హిందీ కమిట్మెంట్స్ ఉన్నాయి.

ఇక జాన్వీని సౌత్ లో లాంచ్ చేయాలనే ఆలోచనలో బోనీ కపూర్ లేడట. పైగా బాహుబలి టైంలో రాజమౌళి శ్రీదేవి మధ్య బాహుబలికి సంబంధించి మాటల మార్పిడి జరిగింది. సో జాన్వీ డెబ్యూని జక్కన్న చేతిలో పెడతాడా అనేది చెప్పలేం. ఇప్పుడు చరణ్ రెస్ట్ పూర్తయ్యే లోపే రాజమౌళి ఓ నిర్ణయానికి రావాలి.