Begin typing your search above and press return to search.

యాంకర్‌ ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్న ఆ నవ్య ఎవరు?

By:  Tupaki Desk   |   20 Dec 2022 8:46 AM GMT
యాంకర్‌ ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్న ఆ నవ్య ఎవరు?
X
బుల్లి తెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు పెళ్లి గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంది. బుల్లితెర స్టార్స్ ల్లో ప్రదీప్ పెళ్లి గురించి ఎక్కువ సార్లు ప్రస్తావన వచ్చింది. ప్రదీప్ పెళ్లి కోసం ఒక రియాల్టీ షో నే నిర్వహించిన విషయం తెల్సిందే. ఆ షో చాలా పెద్ద వివాదం అయ్యింది. ఇప్పటి వరకు కూడా ప్రదీప్‌ పెళ్లి చేసుకోక పోవడంతో చర్చనీయాంశం అయ్యింది.

యాంకర్ గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ప్రదీప్ ఆ మధ్య 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విషయం తెల్సిందే. హీరోగా కంటిన్యూ అవ్వడం లేదు కానీ బుల్లి తెరపై మాత్రం రెగ్యులర్ గా ఈయన షో లు టెలికాస్ట్‌ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ప్రదీప్ మాచిరాజు యొక్క పెళ్లి ప్రస్తావన వచ్చింది.

ప్రదీప్ గత కొంత కాలంగా ఒక ఫ్యాషన్ డిజైనర్‌ తో ప్రేమలో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈమె ప్రస్థానం ఏంటి అనేది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. బుల్లి తెర మరియు సోషల్‌ మీడియా సెలబ్రెటీలకు ఈమె ఫ్యాషన్‌ డిజైనర్ గా వ్యవహరిస్తూ మంచి పేరును దక్కించుకుంది.

బిగ్‌ బాస్ తెలుగు లోని కంటెస్టెంట్స్ లో మెజార్టీ కంటెస్టెంట్స్‌ కు ఈమె కాస్ట్యూమ్స్ ను డిజైన్ చేస్తూ ఉంటుందట. వారి ఫిజిక్ కు తగ్గట్లుగా.. బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా కాస్ట్యూమ్స్ డిజైన్‌ చేయడం ఈమె ప్రత్యేకతగా చెబుతూ ఉంటారు. ఈమె సోషల్‌ మీడియాలో కనిపించదు కానీ ఆమె పేరు మాత్రం రెగ్యులర్ గా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటుంది.

ఇప్పుడు ఆ ఫ్యాషన్ డిజైనర్‌ తో ప్రదీప్ పెళ్లికి సిద్దం అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ కులాంతర వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారట.

అయితే ప్రదీప్‌ సన్నిహితులు మాత్రం ఇప్పటి వరకు ఆ విషయమై క్లారిటీ ఇవ్వలేదు. వచ్చే ఏడాదిలో ప్రదీప్‌ పెళ్లి ఉంటుందని మాత్రం ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితులు నమ్మకంగా చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.