Begin typing your search above and press return to search.
కొత్త బాండ్ విషయంలో షాకింగ్ నిర్ణయం..!
By: Tupaki Desk | 4 Sep 2018 1:30 AM GMTహాలీవుడ్ లో బాండ్ సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కొన్ని దశాబ్దాలుగా బాండ్ చిత్రాలు వేల కోట్ల వసూళ్లను రాబట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా జేమ్స్ బాండ్ చిత్రాలకు మంచి ఆధరణ దక్కింది - దక్కుతుంది - దక్కబోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే జేమ్స్ బాండ్ పాత్రను పోషించే వ్యక్తి వరల్డ్ సూపర్ స్టార్ అంటూ ప్రేక్షకులు అభిమానిస్తారు. ఇప్పటి వరకు ఎంతో మంది హాలీవుడ్ స్టార్స్ జేమ్స్ బాండ్ పాత్రను పోషించారు. డేనియల్ క్రెయిగ్ ప్రస్తుతం బాండ్ చిత్రాల హీరోగా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఈయన బాండ్ గా నాలుగు చిత్రాలు వచ్చాయి. ఆ నాలుగు చిత్రాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా వేలాది కోట్ల వసూళ్లను రాబట్టాయి. ప్రస్తుతం డేనియల్ క్రెయిగ్ బాండ్ గా అయిదవ చిత్రం తెరకెక్కుతుంది.
బాండ్ చిత్రాలను చేయడం అంటే అంత ఆశామాషీ కాదు. కోట్ల పారితోషికం వస్తున్నా - కోట్లాది మంది అభిమానం పొందే అవకాశం ఉన్నా కూడా అంతకంటే ఎక్కువ కష్టం ఉంటుందని డేనియల్ క్రెయిగ్ చెబుతూ ఉంటాడు. అందుకే బాండ్ గా నాలుగు చిత్రాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇకపై బాండ్ పాత్రను పోషించలేను అంటూ తేల్చి చెప్పాడు. కాని నిర్మాతలు మాత్రం ఆయనకు భారీ పారితోషికంను ఆఫర్ చేయడంతో పాటు - బలవంతం చేయడం వల్లే తాజా చిత్రానికి కమిట్ అవ్వడం జరిగింది. ఈ చిత్రం తర్వాత ఖచ్చితంగా డేనియల్ మరో బాండ్ చిత్రాన్ని చేసే పరిస్థితి లేదు. అందుకే కొత్త బాండ్ ను వెదికే పనిలో ప్రొడక్షన్ హౌస్ ప్రతినిధులు ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటి వరకు బాండ్ పాత్రలను శ్వేతజాతీయులు మాత్రమే పోషించడం జరిగింది. మొదటి సారి నల్లజాతీయుడితో బాండ్ పాత్రను పోషించాలనే నిర్ణయానికి నిర్మాణ సంస్థ వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. హాలీవుడ్ సినిమాలకు అత్యధికంగా ప్రేక్షకులు శ్వేతజాతీయులు - బాండ్ సినిమాలను వారు మాత్రమే ఎక్కువ ఆధరిస్తారు. ఇలాంటి నేపథ్యంలో బాండ్ పాత్రకు నల్ల జాతీయుడిని ఎంపిక చేయడం చాలా పెద్ద సాహసం నిర్ణయంగా హాలీవుడ్ ప్రముఖులు చెబుతున్నారు. గతంలో - ప్రస్తుతం హాలీవుడ్ లో పలువురు నల్ల జాతీయులు హీరోలు అయ్యారు. కాని బాండ్ పాత్రకు నల్ల జాతీయుడిని హాలీవుడ్ ప్రేక్షకులు స్వీకరిస్తారా అనేది అనుమానమే. త్వరలోనే కొత్త బాండ్ ను ప్రకటించడంతో పాటు, కొత్త జేమ్స్ బాండ్ సినిమా మొదలు పెట్టే అవకాశాలున్నాయంటున్నారు.