Begin typing your search above and press return to search.
#పాన్ ఇండియా స్టార్ డమ్! టాలీవుడ్ లో నెక్ట్స్ ఎవరు?
By: Tupaki Desk | 18 Jan 2022 4:38 AM GMTప్రస్తుతం ఎటువైపు చూసినా పాన్ ఇండియా స్టార్లే. బాహుబలి ముందు బాహుబలి తర్వాత సన్నివేశం మారిపోయింది. ప్రభాస్ స్ఫూర్తితో చాలా మంది స్లార్లు పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టాలన్న కసితో ఉన్నారు. ఎంపిక చేసుకునే సబ్జెక్టులు పాన్ ఇండియా లెవల్లో ఉండాలని కోరుకుంటున్నారు. ఆ దిశగా ప్రణాళికల్ని రచిస్తూ అంతకంతకు హీట్ పెంచేస్తున్నారు.
ఆరంభంలో అమితాబ్ బచ్చన్.. రజనీకాంత్.. కమల్ హాసన్.. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్లు నటించిన సినిమాలు ఇరుగు పొరుగు భాషల్లోనూ ఆడేవి. కాలక్రమంలో సౌత్ నుంచి ఇరుగుపొరుగును కన్నేసిన స్టార్లు ఎక్కువయ్యారు. తమిళ స్టార్లు సూర్య - అజిత్ తెలుగులోనూ రాణించారు.
అయితే తెలుగు స్టార్లు మాత్రం ఏనాడూ పాన్ ఇండియా స్టార్ డమ్ గురించి మాట్లాడలేదు. కానీ అనూహ్యంగా బాహుబలి రిలీజ్ తర్వాత అంతా మారిపోయింది. సీన్ ఒక్కసారిగా వేడెక్కిపోయింది. కాంపిటీటివ్ స్పిరిట్ అమాంతం రైజ్ అయ్యింది.
నిజానికి మగధీరతో చరణ్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ క్రెడిట్ రాజమౌళిదే. తర్వాత చాలా గ్యాప్ తో ప్రభాస్ మొదలెట్టాడు..బాహుబలితో మొదలై బాహుబలి2-సాహో చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ డమ్ ని కొనసాగించాడు. ప్రభాస్.. రానాలకు గొప్ప గుర్తింపు తెచ్చిన ఘనత.. పాన్ ఇండియా స్టార్ డమ్ నిచ్చిన గొప్పదనం రాజమౌళిదే.
తర్వాత చిరు - సైరా నరసింహారెడ్డితో ట్రై చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు - హరిహరవీరమల్లుతో పాన్ ఇండియా స్టార్ అవుతారు. రాజకీయాల్లో ఉండడం వల్ల పవన్ కొంత నెమ్మదిగానే ఉన్నారు. ఇక ఆర్.ఆర్.ఆర్ తో చరణ్.. తారక్ ఇద్దరికీ పాన్ ఇండియా స్టార్ డమ్ అందుతోంది. ఆ ఇద్దరినీ పాన్ ఇండియా స్టార్లుగా తీర్చిదిద్దుతున్న ఘనత కూడా రాజమౌళికి దక్కుతుంది. కానీ కోవిడ్ డిలేస్ వల్ల పవన్ కానీ.. చరణ్.. తారక్ కానీ చాలా నిరాశతో ఉన్నారు. ఆయా సినిమాల షూటింగులు ఆలస్యమయ్యాయి. దాంతో పాటు రిలీజ్ తేదీలు వాయిదా పడ్డాయి. ఇది వారి అభిమానుల్ని తీవ్ర నిరాశలో ముంచేసే వ్యవహారం.
కేజీఎఫ్ తో యష్ పాన్ ఇండియా స్టార్ అయ్యి కేజీఎఫ్ 2 తెస్తున్నాడు. మరో పాన్ ఇండియా హిట్ కొట్టి తన క్రేజ్ ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. ఇంతలోనే `పుష్ప- ది రైజ్` తో బన్నీ పాన్ ఇండియా స్టార్ గా ప్రమోటయ్యాడు. కేజీఎఫ్ ని మించి పుష్ప విజయం సాధించడంతో ఇప్పుడు అతడి పేరు ఇంటా బయటా మార్మోగిపోతోంది. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో బన్ని ఇప్పుడు పెద్ద హీరో. తదుపరి పుష్ప 2తో దీనిని రెట్టింపు చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక బన్నీ కంటే ముందే పాన్ ఇండియా స్టార్ డమ్ ని విస్తరించాలన్న కసితో చరణ్ పని చేస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ తో నిరూపించుకుని వెంటనే మరో పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ తో టాప్ స్లాట్ లోకి దూసుకెళ్లాలని కసిగా ప్లాన్ చేశాడు. ఆ తర్వాత కూడా కేజీఎఫ్ డైరెక్టర్ .. జర్నీ డైరెక్టర్లను లీడ్ లో ఉంచాడు చరణ్.
ఇలా విశ్లేషిస్తే రేసులో మహేష్ .. పవన్.. తారక్ ల పాన్ ఇండియా స్టార్ డమ్ ఆలస్యమవుతోంది. ప్రభాస్-చరణ్-బన్ని ప్రూవ్డ్.. కానీ మహేష్- పవన్- తారక్ ఇంకా నిరూపించాలి. మహేష్ కి అంత ఆసక్తి లేకపోయినా రాజమౌళితో సినిమా వల్ల పాన్ ఇండియా స్టార్ అవుతాడు. హరిహర వీరమల్లు రిలీజైతే పవన్ కూడా పాన్ ఇండియా స్టార్ గా ఎలివేట్ అవుతాడు. ఇక ఆర్.ఆర్.ఆర్ రిలీజైతే కానీ ఎన్టీఆర్ ని పాన్ ఇండియా స్టార్ అనలేం. అందువల్ల అతడి ప్రయత్నం ఆలస్యమైనట్టే. ఇక ఆర్.ఆర్.ఆర్ తర్వాత కొరటాలతో చేసే సినిమా పాన్ ఇండియా సినిమానే అంటూ ప్రచారం సాగుతోంది. అటుపైనా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల తో తారక్ చేసేది పాన్ ఇండియా సినిమానే. మొత్తానికి నిరూపించుకునేందుకు అందరిలో తహతహ ఉంది. కాకపోతే కొందరికి ఇది ఆలస్యమవుతోంది