Begin typing your search above and press return to search.
సాహో ఫెయిల్యూర్ సుజిత్ ది కాదా?
By: Tupaki Desk | 2 Sept 2019 3:39 PM ISTఇప్పుడు ఎక్కడ చూసినా సినిమాలకు సంబంధించినంత వరకు సాహో తప్ప మరో టాపిక్ వినిపించడం లేదు. మూడు వందల యాభై కోట్ల బడ్జెట్ తో రూపొందినట్టుగా చెప్పుకుని అంతకు రెట్టింపు అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహోకు ప్రేక్షకులు నిర్మొహమాటంగా తమ తీర్పును చెప్పేశారు. వీకెండ్ నాలుగు రోజులు రాకపోయి ఉంటే పరిస్థితి ఇంకెలా ఉండేదో కాని మొత్తానికి పండగ సెలవులు బాగా ప్లస్ అయ్యాయి . ఇదిలా ఉండగా సాహో ఫెయిల్యూర్ కు అందరి వేళ్ళు సుజిత్ వైపే వెళ్తున్నాయి కాని నిజానికి ఇందులో అందరి బాద్యత ఉందని ఒప్పుకోక తప్పదు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం సుజిత్ ముందు ఈ కథ అనుకున్నప్పుడు కేవలం 50 నుంచి 60 కోట్ల మధ్యలో బడ్జెట్ చెప్పాడట. కాని అప్పటికి బాహుబలి 2 విడుదల కాలేదు. కాని దాని ఫలితం చూశాక ప్రభాస్ రేంజ్ ఈ లెవెల్ లో పెరిగిపోవడం చూసి దీన్ని ఇంకాస్త పెంచాలనే ఉద్దేశంతో యువి టీం సుజిత్ ని కనీసం ఓ నూటా యాభై కోట్లకు సరిపడా కాన్వాస్ కు ఇదే కథను మార్పులు చేయమని కోరారట.
దీంతో సుజిత్ తన అనుభవలేమిని పక్కనపెట్టి రిస్క్ చేసి మరీ కోట్ల రూపాయల ఖర్చు డిమాండ్ చేసే ఎపిసోడ్స్ ప్లాన్ చేశాడు. పోనీ ఇదంతా చూసి ప్రభాస్ అయినా ఎందుకు ఇంత వ్యయం అని వారించే ప్రయత్నం చేసుంటే కథ వేరేలా ఉండేదేమో. తనకు చెప్పింది చేయడానికి మాత్రమే పరిమితమైన ప్రభాస్ చొరవ తీసుకోకపోవడం కూడా సాహో పాలిట శాపంగా మారి ఉండొచ్చు. ఎవరు బాధ్యులు అయితేనేం మొత్తానికి సాహో నిరాశపరిచి భారీ బడ్జెట్ ల సినిమాలకు ఒక హెచ్చరికలా మిగిలిపోయింది