Begin typing your search above and press return to search.
'విరాటపర్వం' ఎవరి ఖాతాలోకి వెళుతుంది?
By: Tupaki Desk | 14 Jun 2022 7:30 AM GMTరానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో, హీరోయిన్ లుగా నటించిన క్రేజీ మూవీ 'విరాటపర్వం'. ..నీది నాదీ ఒకే కథ' ఫేమ్ వేణు ఊడుగుల తెరకెక్కించారు. సురేష్ ప్రొడక్షన్స్ డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్. ఎల్ వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మించారు. గత ఏడాది కాలంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. సాయి పల్లవి కారణంగా ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఏడాది కాలంగా ఇతర సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నా 'విరాటపర్వం' మాత్రం విడుదలకు నోచు కోలేదు. దీంతో ఈ మూవీపై పలు వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేశాయి. ఓటీటీలో రిలీజ్ అవుతుందని అన్నారంతా. ఇంతకీ ఈ మూవీ రిలీజ్ అవుతుందా? అనే చర్చ కూడా నడిచింది. ఎట్టకేలకు ఈ మూవీని జూలై 1న రిలీజ్ చేస్తున్నామంటూ దాదాపు 55 రోజుల ముందు రిలీజ్ డేట్ ని ప్రకటించింది చిత్ర యూనిట్.
అయితే ఇన్ని రోజులా? ఇప్పటికే లేట్ అయిందని భావిస్తుంటే మళ్ళీ 55 రోజులు ఎదురుచూడాలా? అంటూ నెటిజన్ లు సినిమా బృందంపై కామెంట్ ల వర్షం కురిపించారు. దీంతో ఫైనల్ గా ఈ మూవీని జూన్ 17న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ముందు నుంచి ఇది రానా సినిమా కాదని, సాయి పల్లవి సినిమా అంటూ ప్రచారం మొదలు పెట్టారు. వెన్నెల అనే పాత్ర ప్రధానంగా సాగే కథగా దీన్ని ప్రమోట్ చేయడం మొదలు పెట్టారు.
ఈ నేపథ్యంలో ఈ మూవీ ఎవరి ఖాతాలోకి వెళుతుంది అనే ఆసక్తికర చర్చ మొదలైంది. రానా హీరో అయినా సాయి పల్లవి చుట్టూ తిరిగే కథ కావడంతో ఈ మూవీ రానా వర్సెస్ సాయి పల్లవిగా మారిపోయింది.
ఈ మూవీ క్రెడిట్ ఎవరికి దక్కేను అన్నదే ఇప్పడు ప్రధాన చర్చగా మారింది. ఇదిలా వుంటే సాయి పల్లవిని ముందుకు నెట్టి చిత్ర బృందం ఈ మూవీకి బజ్ ని క్రియేట్ చేసే పనిలో వున్నారు. డార్క్ థీమ్ నేపథ్యంలో సాగే నక్సల్స్ సినిమాలకు ఈ రోజుల్లో ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడం లేదు.
పెద్దగా ఆడియన్స్ పట్టించుకోవడం లేదు కూడా. మరి ఈ నేఫథ్యంలో రానా మ్యాజిక్ చేస్తాడా? లేక దర్శకుడు చెబుతున్నట్టే సాయి పల్లవి మ్యాజిక్ చేసి ఈ మూవీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంటుందా అని అంతా అంటున్నారు. అలా జరిగితే రానా సోలో హిట్ ని దక్కించుకోవడం కష్టమే అని తెలుస్తోంది.