Begin typing your search above and press return to search.

ట్విట్టర్​ను షేక్​ చేసిన రిహాన్నా ఎవరు?

By:  Tupaki Desk   |   4 Feb 2021 3:30 PM GMT
ట్విట్టర్​ను షేక్​ చేసిన రిహాన్నా ఎవరు?
X
అమెరికాకు చెందిన పాప్​సింగర్​ రిహాన్నా పెట్టిన ఓ ట్వీట్​.. భారతదేశంలో పెను సంచలనం సృష్టించింది. ఆమె పెట్టిన ట్వీట్​కు ట్విట్టర్​ షేక్​ అయ్యింది. నిన్నంతా ఆమె గురించే చర్చ. మనదేశంలో వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యమానికి ఇప్పటికే మనదేశానికి చెందిన పలువురు ప్రజాస్వామిక వాదులు మద్దతు తెలిపారు.

అయితే ఇప్పుడు ఈ వివాదం అంతర్జాతీయ స్థాయికి పాకింది. అమెరికాకు చెందిన పాప్​సింగర్​ రిహాన్నా నిన్న ఓ ట్వీట్​ పెట్టారు.
భారత్​లో జరుగుతున్న రైతు ఉద్యమానికి సంబంధించిన ఓ న్యూస్​ ఆర్టికల్​ను ఆమె జతచేసి..
‘భారత్‌లో జరుగుతున్న రైతు ఉద్యమం గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం లేదు.’ అంటూ ట్వీట్​ పెట్టారు. ఈ ట్వీట్​ పెను ప్రకంపణలు సృష్టించింది.
రిహాన్నాకు కూడా భారీగా ఫాలోయింగ్​ వచ్చింది. ఆమె చేసిన ట్వీట్​ను ఇప్పటివరకు 275.4 k మంది రీట్వీట్​ చేశారు. 753.1 k యూజర్లు లైక్​ చేశారు. అంతేకాక ఆమెకు ఒక్కరోజులోనే 10 లక్షల మంది ఫాలోవర్లు పెరిగారు.


మన విదేశాంగ కూడా ఈ విషయంపై స్పందించింది. మా దేశ అంతర్గత వ్యవహారాలపై ఇతర దేశాలకు చెందిన వాళ్లు ఎందుకు మాట్లాడుకోవాలంటూ కాస్త ఘాటుగానే కౌంటర్​ ఇచ్చింది. మరోవైపు బాలీవుడ్​ స్టార్​ కంగనా రనౌత్​ ‘అది రైతు ఉద్యమం కాదు.. దేశానికి విభజించడానికి చేస్తున్న ఉగ్రవాదుల కుట్ర’ అంటూ రిప్లై ఇచ్చారు. కంగనా రిప్లై కూడా వివాదాస్పదం అయ్యింది. అయితే రిహాన్నా మాత్రం నిన్న చాలామంది భారతీయులు నోట్లో మెదిలారు. ‘ రిహాన్నా ఎవరు’ ‘రిహాన్నా స్వస్థలం పాకిస్థానా’ ఇలా నిన్న లక్షలమంది గూగుల్​లో వెతి కారు.

ఈ విషయాన్ని స్వయంగా గూగుల్​ ప్రకటించింది.
రిహాన్నాతో పాటు స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్, నటుడు జాన్ కుసాక్, యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్, -అమెరికన్ మోడల్, పోర్న్ స్టార్ మియా ఖలీఫా తదితరులు రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారు. అయితే రిహాన్నాకు భారతీయ సెలబ్రిటీలు సచిన్​, అక్షయ్​కుమార్​, విరాట్​ కోహ్లీ గట్టిగా కౌంటర్​ ఇచ్చారు.

ఎవరీ రిహాన్నా.?

రిహాన్నా బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో రిహన్నా ఫెంటీ ఓ పేదకుటుంబంలో జన్మించింది. ఆమె చిన్నతనంలో అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. యవ్వనంలో ఉన్నప్పుడు జీవనోపాధి కోసం తన తండ్రితో పాటు టోపీలు, బెల్టులను విక్రయించారు. 17 వ ఏట ఆమె పాప్​సింగర్​గా కెరీర్​ను ప్రారంభించారు. 2005లో విడుదలైన ఆమె మొట్టమొదటి ఆల్బం ‘మ్యూజిక్ ఆఫ్ ది సన్’ 2 మిలియన్ కాపీలకు పైగా అమ్ముడైంది.