Begin typing your search above and press return to search.

సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న ఈ సృజన ఎవరు?

By:  Tupaki Desk   |   22 April 2019 6:15 AM GMT
సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న ఈ సృజన ఎవరు?
X
గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా - విన్నా వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు సృజన. ముఖ్యంగా టిక్‌ టాక్‌ లో సృజన వీడియోలు - మీమ్స్ ట్రెండ్‌ అవుతున్నాయి. సృజన తిన్నావరా..., సృజన నన్ను వదిలేస్తున్నావా అంటా అంటూ వస్తున్న వీడియోలకు లక్షల్లో వ్యూస్‌ - వేలల్లో లైక్స్‌ వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆడియోతో వీడియోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇంతగా ఫేమస్‌ అయిన ఆ సృజన ఎవరి సృజనాత్మకత నుండి వచ్చిందో అని మొదట భావించారు. అయితే సృజన అనే అమ్మాయితో ఆమె మాజీ లవర్‌ మాట్లాడిన వాయిస్‌ రికార్డింగ్‌ నుండి కొన్ని వాయిస్‌ క్లిప్‌ లు తీసి - వాటికి డీజే టచ్‌ ఇచ్చి రచ్చ చేస్తున్నారు.

సృజన అనే అమ్మాయి - ఆడియో క్లిప్‌ లో వినిపిస్తున్న అబ్బాయి నాలుగు నెలల పాటు ప్రేమించుకున్నారు. అయితే ఏదో కారణం వల్ల అబ్బాయిని సృజన దూరం పెట్టడం మొదలు పెట్టింది. దాంతో ఆ అబ్బాయి సృజనకు ఫోన్‌ చేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఆమెను తిట్టాడు. దాదాపు అర్థ గంట సమయం వారిద్దరి మద్య సంభాషణ జరిగింది. ఆ సంభాషణ నుండి కొన్ని బిట్స్‌ తీసుకుని వాటిని తమ ఇష్టానుసారంగా వాడేసుకుని డీజే సౌండ్స్‌ చేశారు.

సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్న ఆ వాయిస్‌ ఎవరిది - ఎక్కడ ఉంటారు - వారు ఏం చేస్తారు అనే విషయాలపై క్లారిటీ లేదు, కొందరు అసలు ఆ వాయిస్‌ ఏంటీ అనే విషయాలు కూడా తెలియకుండా వీడియోలు చేస్తున్నారు. మొత్తానికి హలో సృజన తిన్నావరా.. ఎప్పుడు లేనంతగా తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌ అవుతోంది.