Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ 30లో జాన్వీ కాదు ఇంకెవ‌రు?

By:  Tupaki Desk   |   23 May 2022 2:42 AM GMT
ఎన్టీఆర్ 30లో జాన్వీ కాదు ఇంకెవ‌రు?
X
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇటీవ‌లే పాన్ ఇండియా స‌క్సెస్ ని అందుకున్న సంగ‌తి తెలిసిందే. SS రాజమౌళి దర్శకత్వం వహించిన తన తాజా చిత్రం RRR గ్రాండ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అదే స‌మ‌యంలో బ్యాక్ టు బ్యాక్ కొర‌టాల‌తో మూవీ.. ప్ర‌శాంత్ నీల్ తో మూవీ పైనా ఫోక‌స్ చేసాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ 30 త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు వెళ్ల‌నుంది.

అయితే ఈ మూవీలో ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే క‌థానాయిక ఎవ‌రు? అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తారక్ సరసన నటించే హీరోయిన్ కోసం మేకర్స్ ఇంకా వేట కొనసాగిస్తున్నారు. ఈ మూవీతో బాలీవుడ్ యువ‌నాయిక అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వీ క‌పూర్ టాలీవుడ్ ఆరంగేట్రం చేస్తుంద‌న్న టాక్ కూడా వినిపించింది. జాన్వీని కొర‌టాల సంప్ర‌దించారు. కానీ అట్నుంచి ఇంకా గ్రీన్ సిగ్న‌ల్ రాలేద‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ జాన్వీ ఖ‌రారు కాలేదు. ఇంత‌లోనే మ‌రో కొత్త పేరు వినిపిస్తోంది.

లేటెస్ట్ గాసిప్ ఏంటంటే.. ఎన్టీఆర్ 30లో హీరోయిన్ గా నటించేందుకు అందాల సుందరి.. టాలెంటెడ్ నటి సాయి పల్లవిని మేకర్స్ సంప్రదించగా ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్లు వినిపిస్తోంది. అయితే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ ఆర్ట్స్- యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు. సాంకేతికంగా అత్యున్న‌తంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు కొర‌టాల ప్లాన్ చేస్తున్నారు. మూవీ కాస్టింగ్ టెక్నీషియ‌న్స్ కి సంబంధించిన మరిన్ని వివ‌రాలు రావాల్సి ఉంది.

తార‌క్ పాన్ ఇండియా స్టార్ డ‌మ్

ఆర్.ఆర్.ఆర్ స‌క్సెస్ తో తార‌క్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. అత‌డు త‌న స్టార్ డ‌మ్ ని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్లాల్సిన స‌మ‌యం వ‌చ్చేసింది. ఇప్ప‌టికే రేసులో ప్ర‌భాస్ - రామ్ చ‌ర‌ణ్ - బ‌న్ని ఉన్నారు. అంద‌రితో పోటీప‌డుతూ స‌త్తా చాటాల్సి ఉంటుంది. న‌ట‌న డ్యాన్సులు ఛ‌రిష్మా ప‌రంగా పై ఎవ‌రికీ తీసిపోని యంగ్ టైగ‌ర్ హిందీ మార్కెట్లోనూ పాగా వేయాల‌ని చూస్తున్నాడు. త‌దుప‌రి ప్ర‌శాంత్ నీల్ తో భారీ పాన్ ఇండియా చిత్రం లుక్ కూడా విడుద‌ల కాగా దానికి అద్భుత స్పంద వ‌చ్చింది. ప్ర‌శాంత్ నీల్ తో అత‌డు భారీ మాస్ యాక్ష‌న్ డ్రామా చేయ‌నున్నాడ‌ని .. తార‌క్ లుక్ ర‌గ్గ్ డ్ గా ఉంటుంద‌ని పోస్ట‌ర్ వెల్ల‌డించింది.

త్రివిక్ర‌మ్ తో బిగ్ ప్లాన్

నిజానికి కొర‌టాల కంటే ముందే త్రివిక్ర‌మ్ తో తార‌క్ సినిమా చేయాల్సింది. ప్రాజెక్ట్ ఇక ముందుకెళ్లిపోవ‌డమేన‌ని అంతా వేచి చూస్తున్న స‌మ‌యంలో మిడిల్ డ్రాప్ అయ్యారు. క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ వ‌చ్చాయని హీరోకి ద‌ర్శ‌కుడికి మ‌ధ్య సింక్ కుద‌ర‌లేదని కూడా గుస‌గుస‌లు వినిపించాయి. అయితే ఇండ‌స్ట్రీలో ఇలాంటివి ప‌ర్మినెంట్ కాదు. టెంప‌ర‌రీ మాత్ర‌మేన‌ని నిరూపిస్తూ ఇప్పుడు తార‌క్ తో త్రివిక్ర‌మ్ క‌లిసిపోయారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖుల్లో దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఉన్నారు. ఇది ఆసక్తికర పరిణామం అన్న చ‌ర్చా సాగుతోంది.

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ తమ ప్రాజెక్ట్ #NTR30 విషయంలో విభేదాల వ‌ల్ల క‌లిసి ప‌ని చేయ‌లేక‌పోయారు. త్రివిక్రమ్ తన 30వ ప్రాజెక్ట్ కి ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేయాల్సి ఉంది. కానీ త్రివిక్రమ్ కొన్ని నిబంధనలకు అంగీకరించడానికి నిరాకరించ‌డంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాతో బిజీ కాగా.. ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ ఇటీవల తన పాత స్నేహితుడైన మహేష్ బాబుతో సినిమాకి క‌మిట‌య్యాడు. అత‌డు- ఖ‌లేజా త‌ర్వాత మ‌హేష్ తో మూడవసారి కలిసి ప‌ని చేస్తున్నాడు. ఇక బ‌ర్త్ డే రోజున‌ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలప‌డం ద్వారా త్రివిక్ర‌మ్ త‌మ‌ మధ్య విభేదాలను తొలగించారు. ఇప్పుడు త్రివిక్రమ్- ఎన్టీఆర్ మధ్య అంతా బాగానే ఉందన్న టాక్ వినిపిస్తోంది. త‌దుప‌రి ఈ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుందని సమాచారం.