Begin typing your search above and press return to search.
కియరా వర్సెస్ ఆలియా! ఎవరు RC 15 ఆప్షన్?
By: Tupaki Desk | 16 July 2021 8:31 AM GMTమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో RC 15 చిత్రీకరణకు లైన్ క్లియరైన సంగతి తెలిసిందే. లైకాతో `భారతీయుడు-2` వివాదం నడుస్తున్న సమయంలో తనని నిలువరించాలని నిర్మాతలు చేసిన ప్రయత్నాన్ని కోర్టు ద్వారా అడ్డుకున్నారు శంకర్. ఇప్పుడు అతడు తదుపరి చరణ్ తో సినిమాని స్వేచ్ఛగా చిత్రీకరించుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేవు.
ఆ క్రమంలోనే తన ప్రణాళికల్ని వేగంగా విస్తరిస్తున్నారు శంకర్. చకచకా తదుపరి చరణ్ సినిమాని ప్రారంభించేందుకు శంకర్ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాలో కథానాయిక ఎవరు? అన్నది సస్పెన్స్ గా మారింది. ఇందులో వినయ విధేయ రామ ఫేం కియరా అద్వాణీ కథానాయికగా నటించే అవకాశం ఉందని ఓ సెక్షన్ నుంచి గుసగుసలు వినిపిస్తుంటే కాదు ఆర్.ఆర్.ఆర్ బ్యూటీ ఆలియా భట్ నే శంకర్ ఎంపిక చేశారని కొన్ని కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఆ ఇద్దరిలో ఎవరిని ఫైనల్ చేశారు? అన్నది ఆర్సీ 15 వర్గాలు వెల్లడించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం కియరా- ఆలియా ఇద్దరూ ట్రెండీ హీరోయిన్లుగా వెలిగిపోతున్నారు. కెరీర్ పరంగా క్షణం తీరిక లేని ఈ భామల్లో ఎవరు ఓకే చెప్పారు? అన్నది ఆసక్తికరం. ఆలియా వరుసగా భారీ పాన్ ఇండియా చిత్రాలతో బిజీ గా ఉంది. మరోవైపు కియరా వరుస సక్సెస్ లతో తదుపరి భారీ చిత్రాల్లో నటిస్తోంది. అయితే శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ అవకాశం ఇస్తే ఎవరూ మిస్ చేసుకోవడానికి సిద్దంగా ఉండరన్నది ఊహించగలం.
ఇంతకుముందు ఆయన చాలా చిన్న రేంజు హీరోయిన్లను పెద్ద స్థాయిలో ఎలివేట్ చేశారు. కస్తూరి- సదా- శ్రీయ- సంధ్య (ప్రేమిస్తే నిర్మాతగా) వంటి హీరోయిన్లను బిగ్ స్క్రీన్ పై ఒక అద్భుతంగా ఆవిష్కరించారు. ఇప్పుడు ఆలియా లేదా కియరా ఇద్దరిలో ఎవరిని జాక్ పాట్ వరించనుందో వేచి చూడాలి.
శంకర్ ఎంచుకున్న కథే కీలకం:
ఆర్సీ 15 కథాంశంపైనా ఇటీవల ఆసక్తికర చర్చ సాగుతోంది. `ఒకే ఒక్కడు`.. `భారతీయుడు`.. `అపరిచితుడు` రేంజ్ లో... శంకర్ మరో అద్భుతమైన స్క్రిప్ట్ ని సిద్ధం చేశారని ప్రచారమవుతోంది. సంఘంలో ఒక నిజాయితీగల ఐఏఎస్ ఆఫీసర్ రాజకీయనాయకుడిగా టర్న్ అయితే ఎలా ఉంటుంది? అనే ఆసక్తికర పాయింట్ తో కథ సాగుతుందని తెలుస్తోంది. సామాజిక రాజకీయ అంశాల కోణంలో ఎమోషనల్ డ్రైవ్ తో కథ అంతా సాగుతుందని టాక్ వినిపిస్తోంది.
ఇందులో చరణ్ పాత్ర ఆసక్తికరం. కలెక్టర్ గా ఉన్న ఓ యువకుడు సీఎంగా బాధ్యతలు తీసుకుంటే వ్యవస్థ లో లోపాలను సరిచేసి సమర్థంగా ఎలా నడిపించగలడు? అనేది చరణ్ పాత్రలో హైలైట్ గా ఉంటుందని తనకు ఎదురయ్యే అడ్డంకుల్ని అతడు ఎలా అధిగమించాడన్నది రసవత్తరంగా ఉంటుందని తెలుస్తోంది. ఒకే ఒక్కడు తరహా కంటెంట్ దానికి భారతీయుడు సేనాపతి తరహా యాక్షన్ టింజ్ ని చూడొచ్చన్న గుసగుసా వేడెక్కించేస్తోంది. రంగస్థలం చిట్టిబాబుగా చరణ్ నటన నచ్చి ఈ సినిమాకి ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ సినిమాకి మూల కథను కార్తీక్ సుబ్బరాజ్ అందిస్తున్నారు.