Begin typing your search above and press return to search.

గీతా డిస్ట్రిబ్యూట‌ర్స్ కి ఠ‌ఫ్ మెగా కాంపిటీట‌ర్‌?

By:  Tupaki Desk   |   24 March 2020 1:00 PM GMT
గీతా డిస్ట్రిబ్యూట‌ర్స్ కి ఠ‌ఫ్ మెగా కాంపిటీట‌ర్‌?
X
టాలీవుడ్ లో అగ్ర నిర్మాత‌లుగా కొనసాగుతూ డిస్ట్రిబ్యూష‌న్- థియేట‌ర్ల‌ రంగంలో కోట్లాది రూపాయాలు ఆర్జిస్తున్న వారిగా అల్లు అర‌వింద్.. దిల్ రాజు.. సురేష్ బాబు రికార్డుల‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ లో నిర్మాత‌లుగా రాణిస్తునే తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూష‌న‌ర్ రంగంలోనూ త‌మదైన‌ మార్క్ వేశారు. ఒక ర‌కంగా సినిమాల నిర్మాణం కంటే ఇత‌ర‌త్రా వ్యాప‌కాల‌తోనే వీళ్లు ఈ రంగంలో భారీ ఆర్జ‌న చేశార‌ని చెబుతుంటారు. త‌మ ఫ్యామిలీ హీరోల సినిమాల‌తో పాటు.. ఇత‌ర స్టార్ హీరోల చిత్రాల్ని.. మంచి కంటెంట్ ఉన్న సినిమాల‌ను మార్కెటింగ్ చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. సినిమా వ్యాపారం అన్న‌ది ఈ ముగ్గురికి తెలిసినంత‌గా మ‌రో నిర్మాత కు తెలియ‌ద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. కొన్ని ద‌శాబ్ధాలుగా ఆన‌లుగురు హోదాలో ఉన్న వీరి పంపిణీ సంస్థ‌లు లాభాల ఆర్జ‌న‌తో పెద్ద స్థాయికి ఎదిగాయి.

ఇక గీత ఆర్స్ట్ జోరు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కొన్నేళ్లుగా ఈ సంస్థ‌కు అనుబంధంగా జీఏ-2 పిక్సర్స్ ని ఏర్పాటు చేసి ఇందులోనూ సినిమాలు రిలీజ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పంపిణీ రంగంలో మిగ‌తా ఇద్ద‌రి కంటే అర‌వింద్ ఐడియాల‌జీ కాస్త యూనిక్ గానే ఉంటుంది. తాజాగా గీత ఆర్స్ట్ కి పోటీగా అదే ఫ్యామిలీలో మ‌రో హీరో డిస్ట్రిబ్యూష‌న్ వార్ కి తెర తీయ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది.

ఇంత‌కీ ఎవ‌రా హీరో? అంటే.. అర‌వింద్ మేన‌ల్లుడు.. మెగాప‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఈ త‌ర‌హా ప్ర‌య‌త్నాల్లో ఉన్నార‌ని తెలిసింది. ఇప్ప‌టికే తెలుగు సినిమాకు ప్ర‌ధాన మార్కెట్ అయిన వైజాగ్.. తూర్పు -ప‌శ్చిమ గోదావ‌రి ఏరియాల్లో చ‌ర‌ణ్ లోక‌ల్ కంపెనీల‌కు ట‌చ్ లో ఉంటూ మంచి ప‌ట్టు సాధించిన‌ట్లు చెబుతున్నారు. మ‌రి ఉన్న‌ట్లుండి చెర్రీ ఈ నిర్ణ‌యం ఎందుకు తీసుకున్న‌ట్లు? గీత ఆర్స్ట్ కు పోటీగా రావాల‌ని ఇలా చేస్తున్నాడా? లేక మామ‌ను మించి గొప్ప బిజినెస్ మ్యాన్ గా ఎద‌గాల‌ని ఇలా చేస్తున్నాడా? అంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

సినిమా వ్యాపారంలో సంపాదించుకున్న వాడికి సంపాదించుకున్నంత‌. ఒక్క‌సారి నేము ఫేమ్ వ‌చ్చిందంటే దాన్ని నిల‌బెట్టుకుంటే వ‌ద్ద‌నుకున్నా కోట్లాది రూపాయలు వ‌చ్చి ప‌డుతుంటాయి. స‌రిగ్గా ఈ పాయింట్ నే చెర్రీ ఇప్పుడు పంపిణీ రంగం వైపు మ‌న‌సు మ‌ళ్లేలా చేసింద‌ని అంటున్నారు. రంగ‌స్థ‌లం విజయం త‌ర్వాత చెర్రీ మార్కెట్ అమాంతం పెరిగింది. ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 200 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించిన‌ సంగ‌తి తెలిసిందే. పంపిణీ దారుల‌కు భారీ లాభాలొచ్చాయి. ఇక‌ నిర్మాత‌ల కింద ఉన్న డిస్ట్రిబ్యూట‌ర్లు నిర్మాతలు ఎంత చెబితే అంత వెచ్చించి సినిమా రైట్స్ కొనుక్కోవాల్సిందే. వాస్త‌వానికి ఈ తంతు ఎప్ప‌టి నుంచో సాగుతున్న‌దే.

ఇదంతా ఓ చైన్ ప్రాసెస్.. మాఫియాలా బ‌య‌ట‌కు తెలియ‌కుండా జ‌రిగిపోతుంది. అయినా లాభాలు లేకుండా ఎవ‌రు వ్యాపారం చేస్తారు? అన్న దృక్కోణం ఇక్క‌డ బ‌లంగా ప‌ని చేస్తుంది. ఈ ఆలోచ‌న‌తోనే చ‌ర‌ణ్ పంపిణీ రంగంలోకి అడుగు పెట్ట‌డానికి స‌మ‌యాత్తం అవుతున్న‌ట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ స్థాపించి సొంతంగా సినిమాలు నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు వోన్ గా అదే బ్యాన‌ర్ పై డిస్ట్రిబ్యూష‌న్ కి దిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇటీవ‌ల‌ స్టార్ హీరోల మార్కెట్ రెట్టింపు అయింది కాబ‌ట్టి ఓపెనింగ్ స‌హా తొలివారం వ‌సూళ్ల‌కు ఢోకా లేకుండా పోతోంది. ఆ న‌మ్మకంతో పంపిణీ దారుడు బేరం లేకుండా చెర్రీ ధైర్యంగా ముందుకు వెళ్లిపోతున్నాడని తెలుస్తోంది.