Begin typing your search above and press return to search.
రేణు దేశాయ్ వెనక గేమ్ ప్లేయర్ ఎవరు?
By: Tupaki Desk | 3 Oct 2019 7:12 AM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్ జోడీ వ్యవహారం తెలిసిందే. 2012లో పవన్ నుంచి రేణూ విడిపోయారు. పూణేలో తన తల్లిదండ్రుల వద్దనే వారసులు సహా జీవనం సాగించారు. ఆ తరువాత పవన్ .. రష్యన్ యువతి అన్నా లెజినోవాను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా రేణూ పైనా.. తమ వారసుల పైనా పవన్ చూపించే అపార ప్రేమ.. బాధ్యత గురించి ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. రేణూకి తన వంతు బాధ్యతగా పవన్ అండగా నిలుస్తున్నారు. మరాఠా సినిమాలు చేయాలని ప్రయత్నించి `ఇష్క్ వాలా లవ్` సినిమాతో నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రేణూకి పవన్ చాలా అండగా నిలిచారు.
ఆ క్రమంలోనే రేణూ మనసంతా కెరీర్ అన్న కోణంలో హైదరాబాద్ చుట్టూనే తిరుగుతుండటంతో ఇక్కడ తనకు కెరీర్ పరంగా ఏదైనా చేయాలని భావించిన పవన్ చాలానే సాయపడ్డారట. బుల్లితెరపై ఢీ డ్యాన్స్ షో కు న్యాయ నిర్ణేతగా అవకాశం కల్పించడం వెనక పవన్ రికమండేషన్ సాయం అందిందని చెప్పుకున్నారు. తన కళ్లముందే వుంటూ ఈ షోలో పాల్గొంటుందని పవన్ భావించి అండగా నిలిచారని తెలిసింది. అయితే ఇదే క్రమంలో బిగ్ బాస్ నుంచి రేణూ దేశాయ్ కి కాల్ రావడం.. అది పవన్ కు తెలియడంతో వెంటనే ఆ ఆఫర్ ని తిరస్కరించమని.. బిగ్ బాస్ షోకి వెళితే తనని రాజకీయంగా విమర్శలకు గురిచేస్తారని పవన్ చెప్పడంతో ఆ ఆఫర్ ని రేణూ తిరస్కరించారని చెబుతున్నారు. ఇక రేణు కి కెరీర్ పరంగా మెగాబ్రదర్ నాగబాబు నుంచి అండదండలు ఉన్నాయన్నది మరో ఆసక్తికర విషయం.
రేణూ దేశాయ్ రెండో పెళ్లి అంటూ అప్పట్లో సామాజిక మాధ్యమాల డిబేట్ గురించి తెలిసిందే. చిత్ర పరిశ్రమకు సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నానని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని రేణూదేశాయ్ చెప్పడం మెగా అభిమానుల్ని ఆందోళనకు గురిచేసింది. అయినా ఆమె నిర్ణయాన్ని పవన్ గౌరవించడంపైనా ఆసక్తికర చర్చ సాగింది. రేణూ వెంట షాడోలా పవన్ తనకు అన్ని రకాలుగా సాయం చేస్తున్నారన్నది ఇన్ సైడ్ టాక్.