Begin typing your search above and press return to search.
మహేష్ మూవీలో ఆ స్పెషల్ పర్సన్ ఎవరు?
By: Tupaki Desk | 28 March 2022 7:12 AM GMTతెలుగు సినిమా మార్కెట్ పెరగడంతో మన దర్శకులు అందుకు తగ్గట్టుగానే సినిమాలని ప్లాన్ చేస్తున్నారు. ఇతర భాషలకు చెందిన నటీనటులని కీలక పాత్రల కోసం తీసుకుంటూ మరింత ఫ్రెష్ మూవీని చూసిన ఫీలింగ్ ప్రేక్షకుడికి కలగాలని ప్లాన్ లు చేస్తున్నారు. గత కొంత కాలంగా తన సినిమాల్లోని ప్రత్యేక పాత్రల కోసం ఇతర భాషలకు చెందిన నటీనటులని ఎంపిక చేసుకుంటూ సరికొత్త విజయాల్ని సొంతం చేసుకుంటున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.
త్వరలో ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ భారీ పాన్ ఇండియా మూవీని తెరపైకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో దాదాపు 11 ఏళ్ల విరామం తరువాత మహేష్ - త్రివిక్రమ్ ల కలయికలో రాబోతున్న మూవీ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఇటీవలే లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో వుంది.
ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన కీలక నటీనటవర్గంతో పాటు సాంకేతిక నిపుణుల బృందాన్ని ఫైనల్ చేసిన త్రవిక్రమ్ కీలక పాత్రలో నటించనున్న నటుడిని మాత్రం ఇంత వరకు ఫైనల్ చేయలేదంట. ప్రస్తుతం ఈ పాత్రకు సంబంధించిన చర్చ జరుగుతోంది. మహేష్ పాత్రకు దాదాపుగా సమానంగా సాగే ఈ పాత్ర కోసం ముగ్గురు ప్రముఖ నటులని దర్శకుడు పరిశీలిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లేదా తమిళ నటుడు సముద్రఖని, లేదా విజయ్ సేతుపతిలలో ఒక్కరిని కీలక పాత్ర కోసం ఎంపిక చేసుకోవాలని త్రివిక్రమ్ ఆలోచన చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ముగ్గురిలో ఎవరూ సెట్ కాకపోతే తను డిజైన్ చేసిన పాత్రకు ఏ నటుడు అయితే పర్ ఫెక్ట్ గా సూటవుతాడో ఆయననే రంగంలోకి దింపాలని త్రివిక్రమ్ అన్వేషణ మొదలు పెట్టారని ఇన్ సైడ్ టాక్. ప్రధానంగా ఈ పాత్ర కోసం తమిళ, మలయాళ నటులని మాత్రమే ఫైనల్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట.
అయితే ఈ విషయంలో ఫైనల్ నిర్ణయం మాత్రం మహేష్ కే వదిలేశారట. అయిన ఎవరిని ఫైనల్ చేస్తే వారితోనే వెళ్లాలని త్రివిక్రమ్ ప్లాన్. త్వరలోనే కీలక పాత్రలో నటించేది ఎవరో టీమ్ ప్రకటించే అవకాశం వుందని తెలిసింది.
ఇదిలా వుంటే మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 ప్లస్ రీల్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి రాబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చక చకా జరిగిపోతున్నాయి.