Begin typing your search above and press return to search.
నోలాన్ `టెనెట్`ని కాపీ కొట్టిన స్టార్ డైరెక్టర్?
By: Tupaki Desk | 7 Feb 2021 3:30 AM GMTతమిళ స్టార్ హీరో శింబు కథానాయకుడిగా వెంకట్ ప్రభు తెరకెక్కించిన `మానాడు` త్వరలో రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 3 న ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా శిలాంబరసన్ అలియాస్ శింబు ఫ్యాన్స్ లో జెట్ స్పీడ్ తో వైరల్ అయ్యింది.
మానాడు టీజర్ వె బ్‌లోకి వచ్చిన వెంటనే చాలామంది ఈ చిత్రాన్ని క్రిస్టోఫర్ నోలన్ టెనెట్ తో పోల్చడం వేడెక్కించింది. టెనెట్ గత సంవత్సరం థియేటర్లలో విడుదలై క్రైసిస్ లోనూ చక్కని ఆదరణ దక్కించుకుంది. అయితే టెనెట్ కథ తనకు అర్థం కాలేదని..అలాంటి పోలికలు చూడటానికి ముందు ట్రైలర్ కోసం వేచి ఉండమని అభిమానులను కోరారు వెంకట్ ప్రభు.
మానాడు టీజర్ లో ``సమయం ఎవ్వరి కోసం వేచి ఉండదు. అది ఒకరి కోసం వేచి ఉంటే? (Sic)`` అనే ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ ని బట్టి ఈ సినిమా కథాంశం పూర్తి ప్రయోగాత్మకంగా ఉంటుందని అర్థమైంది. ఈ డైలాగులు విజువల్స్ వల్లనే మనాడును టెనెట్ తో పోల్చారంతా.
అనంతరం # మానాడు # టెనెట్ అనే హ్యాష్ ట్యాగ్ లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి. ఇప్పుడు వెంకట్ ప్రభు ట్విట్టర్లో పోలికలపై చాలా ఉల్లాసంగా స్పందించారు. ట్రైలర్ కోసం వేచి ఉండాలని అభిమానులను కోరారడం ద్వారా తొందరపడొద్దని అన్నారు. టెనెట్ తో పోల్చినందుకు నాకు చాలా గౌరవం దక్కింది. కానీ దురదృష్టవశాత్తు ఇది దానితో కనెక్ట్ కాదు! ట్రైలర్ వచ్చేవరకూ ఆగండి.. అప్పుడే వేరే చిత్రంతో పోల్చవచ్చు !! అని వెంకట్ ప్రభు వ్యాఖ్యానించారు.
రాజకీయ వ్యంగ్య చిత్రమిదని ప్రచారమవుతోంది. మానాడు కథ టెనెట్ కి భారతీయ వెర్షన్ అని చాలా మంది అభిమానులు భావిస్తున్నారు కాబట్టి .. ఆ మేరకు కాపీ క్యాట్ అన్న టాక్ ని తిప్పి కొట్టాల్సి ఉంటుంది. మానాడు టీజర్ తమిళం- హిందీ- మలయాళ భాషలలో విడుదలైంది. సురేష్ కామాచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.