Begin typing your search above and press return to search.

శృతిని అంత‌మాట‌న్న నిర్మాత ఎవ‌రు?

By:  Tupaki Desk   |   28 Jan 2022 8:30 AM GMT
శృతిని అంత‌మాట‌న్న నిర్మాత ఎవ‌రు?
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ `క్రాక్‌` చిత్రంతో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చింది శృతిహాస‌న్‌. ఈ మూవీతో మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచి పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. శృతిహాస‌న్ న‌టిస్తున్న తాజా చిత్రం `స‌లార్‌`. ప్ర‌భాస్ హీరోగా అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్ర‌శాంత్ నీల్ రూపొందిస్తున్నారు. ఇప్ప‌టికే 50 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తయింది. త్వ‌ర‌లోనే తాజా షెడ్యూల్ త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతోంది.

విహార యాత్ర‌కు యూర‌ప్ వెళ్లిన ప్ర‌భాస్ ఇటీవ‌ల హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చేశారు. దీంతో ఈ మూవీ తాజా షెడ్యూల్ కు సంబంధించిన ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ రోజు `స‌లార్‌` హీరోయిన్ శృతిహాస‌న్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అంద‌జేసింది. ఇదిలా వుంటే శృతిహాస‌న్ ఓ షాకింగ్ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. త‌న‌ని ఓ నిర్మాత త‌గ్గించుకుంటే మంచి ద‌ని స‌ల‌హా ఇచ్చార‌ని చెప్పి షాకిచ్చింది.

క‌రోనా విళ‌య‌తాండ‌వం చేస్తున్న స‌మ‌యంలో స్టార్స్ త‌మ పారితోషికాలు త‌గ్గించుకోవాల‌నే చ‌ర్చ జ‌రిగింది. చాలా వ‌ర‌కు సినీ కార్మిక సంఘాలు ఈ విష‌యంలో స్టార్స్ ఆలోచించాల‌ని కోరాయి. కానీ ఏ ఒక్క‌రూ ఈ విష‌యంలో త‌గ్గ‌డం లేదు స‌రిక‌దా గ‌తంతో పోలిస్తే భారీగా పారితోషికాలు పెంచేసి షాకిస్తున్నారు. ఇక శృతిహాస‌న్ ని అంతా చెబుతున్న‌ట్టే త‌న పారితోషికం త‌గ్గించుకోవాల‌ని ఓ నిర్మాత కోరాడ‌ట‌. అయితే అత‌నికి శృతి దిమ్మ‌దిరిగే స‌మాధానం చెప్పింద‌ట‌. నేను త‌గ్గించుకోవ‌డానికి సిద్ధ‌మే కానీ హీరోలు త‌గ్గించుకున్న‌ప్పుడే తాను కూడా త‌గ్గిస్తాన‌ని తెలిపి షాకిచ్చింద‌ట‌.

క‌రోనా స‌మ‌యంలో నా రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకోమ‌ని ఓ నిర్మాత అడిగాడు. ఆ టైమ్ లో నా సినిమాలో హీరో మాత్రం రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. నేను వెంట‌నే కుద‌ర‌ద‌ని చెప్పేశాను. హీరో, హీరోయిన్ లు పారితోషికాల మ‌ధ్య చాలా వ్య‌త్యాసం వుంది. ఎంతంటే క‌నీసం క‌ల‌లో కూడా ఊమించ‌లేనంత‌. కాబ‌ట్టి హీరోల‌తో స‌మానంగా హీరోయిన్ ల‌కు రెమ్యున‌రేష‌న్ ఇవ్వాల‌ని డిమాండ్ చేయ‌డం అవివేకం అవుతుంది.

దాని గురించి మాట్లాడ్డం కూడా చాలా ఇబ్బంది. అంటూ త‌న‌కు ఎదురైన అనుభ‌వాన్ని పంచుకుంది. అయితే అలా త‌న‌ని అడిగిన నిర్మాత ఎవ‌రు? .. త‌ను త‌గ్గించుకుంటాన‌న్నా నేను మాత్రం త‌గ్గించుకోను అని చెప్పిన హీరో ఎవ‌ర‌న్న‌ది మాత్రం శృతి బ‌య‌ట‌పెట్ట‌లేదు.

ఇక త‌ను న‌టిస్తున్న `స‌లార్‌` మూవీ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించింది శృతి ` స‌లార్‌` పూర్తి స్థాయి యాక్ష‌న్ డ్రామా. అయితే ఇందులో నేను `క్రాక్‌` త‌ర‌హాలో యాక్ష‌న్ స‌న్నివేశాలు చేయ‌లేదు. క‌థ‌లోనే యాక్ష‌న్ వుంది. ఇందులో నా పాత్ర చాలా స‌హ‌జంగా సాగుతుంది. సినిమాలో నా పాత్ర‌కు ప్రాధాన్య‌త వుండ‌ద‌ని చాలా మంది ప్ర‌చారం చేస్తున్నారు. కానీ అస‌లు ట్విస్ట్ ఏంటంటే క‌థ‌ను న‌డిపించేదే నా పాత్ర‌. ఇంత‌కు మించి ఈ సినిమా గురించి ఏమీ చెప్ప‌లేను లెప్ప‌కూడ‌దు కూడా` అని షాకింగ్ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది శృతి.