Begin typing your search above and press return to search.
సంక్రాంతి విన్నర్ ఎవరో?
By: Tupaki Desk | 10 Dec 2021 3:30 AM GMTప్రతీ ఏడాది సంక్రాంతి వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద సినిమాల హంగామా ఓరేంజ్‌లో వుంటుంది. బిగ్ స్టార్స్ నుంచి పేరున్న హీరోలంతా తమ సినిమాని సంక్రాంతికి బరిలో నిలపాలని.. బ్లాక్ బస్టర్ హిట్‌ని దక్కించుకోవాలని ఉవ్వళ్లూరుతుంటారు. ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి కూడా స్టార్ హీరోలు తమ క్రేజీ చిత్రాలతో పోటీపడుతున్నారు. ఈ రేస్ మహా రసవత్తరంగా .. ఒక విధంగా చెప్పాలంటే ఉత్కంఠ భరితంగా సాగనున్నట్టుగా కనిపిస్తోంది. కారణం ఈ సంక్రాంతి రేసులో హేమా హేమీలు పోటీకి దిగడమే.
ఈ సంక్రాంతికి గట్టి పోటీనిస్తూ ముందు వరుసలో వున్న మూవీ `ఆర్ ఆర్ ఆర్`. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన పాన్ ఇండియా స్థాయి మూవీ ఇది. `బాహుబలి` వంటి సంచలన చిత్రం తరువాత రాజమౌళి నుంచి వస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం కావడం.. పైగా దేశ భక్తి ప్రధానంగా సాగే కథతో .. చరిత్రలో నిలిచిపోయిన ఇద్దరు పోరాట యోధుల కథగా దీన్ని వెండితెరపై రాజమౌళి దృశ్యమానం చేశారు. తాజాగా గురువారం విడుదల చేసిన ట్రైలర్ లోని సన్ని వేశాలు రొమాంచితంగా వుండటమే కాకుండా రెండుబొబ్బులు చెలరేగితే ఎలా వుంటుందో కళ్లకు కట్టినట్టుగా చూపించారు.
దీంతో ఈ సినిమా సంక్రాంతికి ఒక్క తెలుగులోనే కాకుండా వరల్డ్ వైడ్‌గా సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. జనవరి 7న ముందే తెలుగు సినీ ప్రియులకు సంక్రాంతి సంబరాల్ని తెస్తున్న ఈ మూవీ సంక్రాంతి రేసులో పై చేయిని సాధించడం ఖాయంగా చెబుతున్నారు. ఇక ఈ సినిమా తరువాత అంటే దాదాపు వారం గ్యాప్‌తో ప్రభాస్ చిత్రం `రాధేశ్యామ్` థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ మూవీపై కూడా భారీ అంచనాలే వున్నాయి. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించారు. గత జన్మల నేపథ్యంలో సాగే విజువల్స్ వండర్‌గా ఈ మూవీ వుండబోతోందని ఇటీవల విడుదల చేసిన టీజర్ స్పష్టం చేసింది.
యూరప్ హెరిటేజ్ అందాలని.. అలనాటి కాలాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్న చిత్రమిది. రొమాంటిక్ హెరిటేజ్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ సరికొత్త నేపథ్యంలో తెరకెక్కించారు. `ప్రేమ పావురాలు` ఫేమ్ భాగ్యశ్రీ చాలా ఏళ్ల తరువాత కెమెరా ముందుకు రావడం.. రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్రలో కనిపించడం.. `సాహో` తరువాత ప్రభాస్ చేస్తున్న పాన్ ఇండియా స్థాయి సినిమా కావడం.. వరల్డ్ వైడ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని అందుకు తగ్గట్టుగా భారీ ఖర్చుతో ఈ సినిమా యువీ సంస్థ బాలీవుడ్ మేకర్స్ టీ సిరీస్ తో కలిసి పిరమించడం వంటి కారణాలతో ఈ సినిమా పై భారీ క్రేజ్ ఏర్పడింది. సంక్రాంతి బరిలో ఈ సినిమా కూడా గట్టి పోటీనిస్తుందని తెలుస్తోంది.
ఓ పక్క `ఆర్ ఆర్ ఆర్` ఓ రామ్ చరణ్ , ఎన్టీఆర్ బరిలో పోటీపడుతుంటే మరో పక్క ప్రభాస్ సోలోగా `రాధేశ్యామ్`తో రంగంలోకి దిగుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వీరిద్దరి పోటీ ఇలా వుంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ... దగ్గు బాటి రానాతో కలిసి మేమూ పోటీకి సై అంటూ కాలు దువ్వేశాడు. పవన్ కల్యాణ్ - రానా తొలిసారి కలిసి నటించిన చిత్నం `భీమ్లా నాయక్`. మలయాళ బ్లాక్ బస్టర్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. నిత్యమీనన్ .. పవన్ కు జోడీగా నటించిన ఈ చిత్రంపై కూడా అంచనాలు భారీగానే వున్నాయి.
అయితే మిగత రెండు చిత్రాలకూ.. భీమ్లా నాయక్` చిత్రానికి వున్న తేడా ఏంటంటే ఇది పాన్ ఇండియా రేంజ్ సినిమా కాదు.. అంతే కాకుండా యూనివర్సల్ అప్పీల్ వున్న మూవీ కాదు.. ఊర మాస్ సినిమా. ఇద్దరు వ్యక్తుల ఈగోల నేపథ్యంలో సాగే చిత్రమిది. అయినా సరే మిగతా రెండు చిత్రాలకు `భీమ్లా నాయక్` గట్టి పోటీని ఇవ్వడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మూడింటికి మూడు చిత్రాలు దేనికదే ప్రత్యేకతతో బరిలోకి దిగుతుండటంతో ఈ సంక్రాంతి విజేత ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.