Begin typing your search above and press return to search.

కమల్ కూతురి కేసులో మొదటి అడుగు

By:  Tupaki Desk   |   13 Nov 2018 11:03 AM GMT
కమల్ కూతురి కేసులో మొదటి అడుగు
X
లోక నాయకుడు కమల్ హాసన్ రెండో కూతురు హీరోయిన్ శృతి హాసన్ చెల్లెలు అక్షర హాసన్ సీక్రెట్ ఫోటోలు ఆన్ లైన్ లో లీక్ అయిపోయి నానా రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. తాజాగా దీంట్లో ఇంకాస్త ముందడుగు పడేలా చర్యలు మొదలయ్యాయి. ముంబైలోని బికెసి పోలీస్ స్టేషన్ లోని సైబర్ సెల్ లో దీని గురించి ఫిర్యాదు చేసిన అక్షర దీని వల్ల బాగా మనస్థాపం చెందినట్టు తన ట్విట్టర్ లో పేర్కొంటూ కేసుకు సంబందించిన విచారణ జరుగుతోందని చెప్పింది. ఇక పోలీసుల వెర్షన్ చూస్తే అసలు అవి ఒరిజినల్ ఫొటోలా లేక మార్ఫింగ్ చెసినవా అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీనికి ఐపి అడ్రెస్ ని ప్రామాణికంగా తీసుకోబోతున్నారు.

అసలు అవి ఎక్కడి నుంచి పోస్ట్ అయ్యాయి లొకేషన్ ఏంటి అనే వివరాలు ట్రేస్ చేసే పనిలో పడ్డారు. అక్షర హాసన్ సైతం అవి మార్ఫింగ్ అని చెప్పడం లేదు. అలా అని ఒరిజినల్ అనీ ఒప్పుకోవడం లేదు. ఇది కాస్త చిక్కుముడిగానే ఉంది. అక్షర హాసన్ కనక లీడింగ్ ఉన్న హీరోయిన్ అయ్యుంటే ఇప్పుడీ రచ్చ ఇంకో లెవెల్ లో ఉండేది. అడపాదడపా కనిపించడం తప్ప అక్షర మీడియాకు సైతం అందుబాటులో ఉండదు. ఆ మధ్య అజిత్ వివేగంలో ఓ కీలక పాత్ర చేసిన అక్షర ఆ తర్వాత తెరమీద మళ్ళి కనిపించలేదు. ఆ సినిమా ఫలితం కూడా అవకాశాల మీద ప్రభావం చూపించింది.

ఇప్పుడు మళ్ళి ఈ వివాదం ద్వారా వెలుగులోకి వచ్చింది. దీని మీద కమల్ కానీ శృతి కానీ తల్లి హారిక కానీ నేరుగా స్పందించలేదు. జాతి మొత్తం మీటూ ఉద్యమం ద్వారా చైతన్యవంతం అవుతున్న సమయంలో తనకు ఇలా జరగడం చాలా బాధగా ఉందంటున్న అక్షర హాసన్ నిందితులను మాత్రం వదిలి పెట్టే సమస్యే లేదని తేల్చిచెబుతోంది