Begin typing your search above and press return to search.
ఆ 100 కోట్ల పార్టీ ఎవరు దానయ్య ?
By: Tupaki Desk | 15 March 2019 7:13 AM GMTనిన్న ఆర్ ఆర్ ఆర్ ప్రెస్ మీట్ లో ఓ జర్నలిస్ట్ నిర్మాత దానయ్యను నేరుగా మీకెవరో వంద కోట్లు తీసుకుని ఈ సినిమా వదిలేయమని ఆఫర్ ఇచ్చారటగా అని అడిగేశాడు. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలకు నో కామెంట్స్ అనో లేదా ఆబ్బె అలాంటిది ఏమి లేదనో కొట్టిపారేయడమో చేస్తారు. కానీ దానికి భిన్నంగా దానయ్య అవును నిజమే కానీ రాజమౌళితో ఎప్పటి నుంచో సినిమా చేయడాన్ని కలగా భావిస్తున్న తాను ఇలాంటి అరుదైన అవకాశాన్ని ఎలా వదులుకుంటాను అని పబ్లిక్ గా చెప్పేశారు.
అంటే ఎవరో వంద కోట్ల ఆశ చూపిన మాట నిజమే అని ఒప్పుకున్నట్టు అయ్యింది . మరి ఆఫర్ ఇచ్చిన పార్టీ ఎవరో బయట పెట్టలేదు. అలా చేసే ఛాన్స్ కూడా లేదనుకోండి. లేస్తే ఒకరి మొహాలు ఒకరు చూసుకోవాల్సిన పరిశ్రమలో అలా ఉన్న నిజాలు చెప్పేయడం కుదరదు. ఇప్పుడు మీడియా వర్గాల్లో ఆ వంద కోట్ల పార్టీ ఎవరూ అనేదే చర్చగా మారింది. వంద కోట్లు అంటే చిన్న మొత్తం కాదు. ఎంత లేదన్నా ఓ నాలుగు తరాలు సుఖంగా బ్రతికేయవచ్చు. ఎవరో దాకా ఎందుకు దానయ్య మీడియం రేంజ్ హీరోలతో ఓ ఐదు సినిమాలు తీసి ఇంకో పాతిక అదనంగా వెనకేసుకోవచ్చు.
ఇలా వంద కోట్లను పెట్టుబడులుగా మార్చుకుంటే లాభాలు వచ్చే మార్గాలు కోకొల్లలు. అయినా వాటిని కాదని దానయ్య ఆర్ ఆర్ ఆర్ కోసం నో చెప్పడం విశేషమే. వంద కోట్లు తృణప్రాయంగా ఇవ్వాలి అనుకున్నారు అంటే ఈ ప్రాజెక్ట్ మీద ఎన్ని వందల కోట్ల బిజినెస్ ని సదరు పార్టీ ఆశించి ఉండొచ్చు. ఏమైనా ఆర్ ఆర్ ఆర్ ఇలా అన్ని రకాలుగా సెన్సేషన్ అవ్వడం చూస్తుంటే వచ్చే ఏడాది రిలీజ్ టైంకి పరిస్థితిని ఊహించడమే కష్టంగా ఉంది