Begin typing your search above and press return to search.

'డీజే టిల్లు' థియేట్రిక‌ర్ రైట్స్ ఎవ‌రికంటే?

By:  Tupaki Desk   |   7 Feb 2022 3:49 AM GMT
డీజే టిల్లు థియేట్రిక‌ర్ రైట్స్ ఎవ‌రికంటే?
X
యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం ‘ డీజే టిల్లు’. ‘అట్లుంటది మనతోని’ అనేది సినిమా ఉపశీర్షిక. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. విమల్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు.

ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాల‌ని భావించారు. కానీ అనూహ్యంగా వాయిదా వేసారు. తాజాగా ఫిబ్ర‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. నేరుగా థియేట‌ర్ లోనే చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా థియేట్రిక‌ల్ రైట్స్ ని ప్రైమ్ షో ఫిలింస్ ద‌క్కిచుకుంది. తెలుగు రాష్ర్టాల్లో చిత్రాన్ని పెద్ద ఎత్తున‌ రిలీజ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు శ్రోత‌ల్ని ఆక‌ట్టుకుంటున్నాయి. దీంతో సినిమాకి మంచి బ‌జ్ క్రియేట్ అవుతోంది.

ఇందులో ప్రిన్స్ సిసిల్..ప్ర‌గ‌తి..న‌ర్రా శ్రీనివాస్..బ్ర‌హ్మాజీ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.