Begin typing your search above and press return to search.

`ఓడియ‌న్` తెలుగు రైట్స్ అంతుందా?

By:  Tupaki Desk   |   8 Dec 2018 10:22 AM GMT
`ఓడియ‌న్` తెలుగు రైట్స్ అంతుందా?
X
మ‌ల‌యాళ సీనియ‌ర్ హీరో, లెజెండ్ మోహ‌న్‌లాల్‌కి గ‌త కొంత‌కాలంగా టాలీవుడ్ బిజినెస్‌ స‌ర్కిల్స్‌ లోనూ ఇమేజ్ అనూహ్యంగా పెరిగిన సంగ‌తి తెలిసిందే. `కాలాపాని`(90ల‌లో) రోజుల నుంచి మోహ‌న్‌లాల్‌ కి తెలుగులో ఫ్యాన్స్ ఉన్నా `జ‌న‌తా గ్యారేజ్‌` లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ త‌ర్వాత ఆ స్థాయి అనూహ్యంగా పెరిగింది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ లోనూ లాల్ అంటే ప్ర‌త్యేక గౌర‌వం పెరిగింది. అటు పై `మ‌న్యంపులి` క‌మ‌ర్షియ‌ల్ విజ‌యంతో లాల్ మ‌రో కొత్త కోణంలోనూ క‌నిపించారు మ‌న ఆడియన్స్ కి.

ప్ర‌స్తుతం మోహ‌న్‌లాల్ న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం `ఓడియ‌న్‌` ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈనెల 14న మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళం, హిందీలో అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే తెలుగు రిలీజ్ హ‌క్కుల‌కు భారీ క్రేజు నెల‌కొంద‌ని వార్త‌లొచ్చాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం డీల్ పూర్త‌యింది. మోహ‌న్‌లాల్ క్రేజు తో తెలుగు రైట్స్‌ కి 8కోట్లు (అన‌ధికారికం) ప‌లికింద‌ని చెబుతున్నారు. ఇక ఈ సినిమాతో ద‌గ్గుబాటి కుటుంబానికి చెందిన వాళ్లు పంపిణీరంగంలోనూ అడుగులు వేస్తున్నార‌ట‌. `ద‌గ్గుపాటి క్రియేష‌న్స్` పేరుతో ద‌గ్గుబాటి కుటుంబానికే చెందిన‌ ద‌గ్గుపాటి అభిరామ్, సంప‌త్ కుమార్ సంయుక్తంగా ఓడియెన్ రైట్స్‌ని చేజిక్కించుకున్నారు. దగ్గుబాటి అభిరామ్ అన‌గానే మూవీ మొఘ‌ల్ డా.డి.రామానాయుడు మ‌న‌వ‌డు, డి.సురేష్‌బాబు కొడుకు అని అనుకున్నారంతా. కానీ ఈ అభిరామ్ వేరే అని తెలుస్తోంది.

ఈ చిత్రంలో మోహ‌న్‌లాల్ భారీ ప్రాయోగం చేస్తున్నారు. అప్ప‌టిక‌ప్పుడు మృగం లా భారీ కాయుడిగా మారిపోతార‌ట‌. సేమ్ టైమ్ యువ‌కుడి గానూ మారిపోతుంటార‌ట‌. యువ‌కుడి గెట‌ప్‌ కోసం మెహ‌న్ లాల్ త‌న వ‌య‌సుని 55 నుండి 35కు త‌గ్గించుకుని క‌నిపించ‌డం మ‌రో హైలైట్‌. ఇదివ‌ర‌కూ ఆయ‌న లుక్‌ని లాంచ్ చేసిన‌ప్పుడు అభిమానులు స‌ర్‌ ప్రైజ్ అయ్యారు. యెగా- వ్యాయామం నిరంత‌రం చేస్తూ ఆయ‌న భారీగా బ‌రువు త‌గ్గారు. ఈ చిత్రంలో అద్బుతమైన గ్రాఫిక్స్ ప్ర‌త్యేకంగా అల‌రిస్తాయ‌ని తెలుస్తోంది. ఇలాంటి క్రేజీ సినిమా తెలుగు హ‌క్కుల్ని ఫ్యాన్సీ రేటుకి ద‌క్కించుకుని ద‌గ్గుపాటి క్రియేష‌న్స్ రిలీజ్ చేస్తోంది. టాలీవుడ్ కి చెందిన ప‌లువురు బ‌డా నిర్మాత‌లు పోటిప‌డినా భారీ ధ‌ర చెల్లించి హ‌క్కుల్ని చేజిక్కించుకున్నార‌ట‌.