Begin typing your search above and press return to search.
పవన్ కి ఆ క్లారిటీ లేదని ఎవరన్నారు?
By: Tupaki Desk | 10 Jun 2022 6:38 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇతర హీరోల సినిమా ఈవెంట్లకు హాజర్వడం అన్నది చాలా రేర్. పవన్ కి బాగా కావాల్సిన వాళ్లు అయితేనో...లేక స్నేహితులు అయితేనో తప్ప హాజరు కారు. ఆ మధ్య మేనల్లుడు సాయితేజ్ కి యాక్సిడెంట్ అయి ఇబ్బందులు పడుతుతోన్న సమయంలో అతను నటించిన 'రిపబ్లిక్' సినిమా ప్రచారం బాధ్యతలు పవన్ తీసుకున్నారు.
సినిమా తీసిన నిర్మాతలు నష్టపోకూడదని సాయి స్థానంలో పవన్ ఆ సినిమా ప్రీ రిలీజ్ కి హాజరై బజ్ తీసుకొచ్చారు. ఇదే వేదికగా రాజకీయంగాను వ్యాఖ్యలు చేసి పెద్ద దుమారమే రేపారు. ఆ సమయంలోనే పవన్ రాజకీయ కోణంలో అక్కడికి వచ్చారా? లేక సినిమా ప్రచారం కోసం హాజరయ్యారా? అని రకరకాల కారణాలు తెరపైకి వచ్చాయి.
పవన్ వ్యాఖ్యలపై అప్పట్లో ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగింది. అప్పటి నుంచి పవన్ ఏపీ రాజకీయాల్లో మరింత టార్గెట్ అయ్యారు. ఆ వ్యాఖ్యలు పరిశ్రమలో అతనికి వ్యతిరేక పవనాలు వీచేలే దారి తీసాయి. ఎవరికి వారు పవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేసారు. అయినా పవన్ ఒంటరిగా నిలబడి పోరాటం చేసారు.
మరి ఆ పోరాంట ఫలించిందా? పక్క దారి పట్టిందా? అన్నది పక్కనబెడితే..తాజాగా పవన్ సినిమా -రాజకీయం వేరు అంటూ రెండింటీని సపరేట్ చేసి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. నాని హీరోగా నటించిన 'అంటే సుందరానికీ' సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి అతిధిగా హజరై పవన్ ఈ దుమారం రేపారు.
'తెలుగు పరిశ్రమ అందరిది. ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. సినిమా..రాజకీయం వేరని నాకు స్ఫష్టత ఉంది. ఎన్ని దెబ్బలు ఎదురైనా నిలబడగలిగే గుండె ధైర్యం ప్రేక్షకులు..పరిశ్రమ నాకిచ్చింది. పరిశ్రమలో రాజకీయ పరంగా ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన ఆలోచన ఉండొచ్చు. ఎలాంటి ఆలోచనలు ఉన్నా సినిమా-రాజకీయం వేరు' అన్నారు.
పవన్ వ్యాఖ్యల్ని బట్టి పరిశ్రమలో ప్రభుత్వ అననూయల ప్రభావం తీవ్రంగానే ఉందన్న కారణం తెరపైకి వస్తోంది. సినిమా-రాజకీయం వేరని ఇన్నాళ్లు పవన్ ఏమాత్రం క్లారిటీ లేదని వెనుక నుంచి నిప్పంటించే ప్రయత్నాలు సాగుతున్నాయనే వాదన వినిపిస్తుంది. పరిశ్రమలో పవన్ ని ఒంటరి వాడిగా చిత్రీకరించాలన్న ధోరణి స్పష్టంగా కనిపించింది.
ఆ మధ్య ఛాంబర్ సైతం ఇదే విషయాన్ని పరోక్షంగా చెప్పకనే చెప్పే ప్రయత్నం చేసింది. పవన్ వ్యాఖ్యలతో ఛాంబర్ కి ఎలాంటి సంబంధం లేదని..అవి అతని వ్యక్తిగత వ్యాఖ్యలు అని దయచేసి పరిశ్రమతో ముడిపెట్టి మాట్లాడవదద్దని చెప్పే ప్రయత్నం ఆ నాడు కనిపించింది.
కేవలం కొంత మంది మాత్రమే పవన్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ కామెంట్లు పోస్ట్ చేసారు. కానీ మెజార్టీ వర్గం మాత్రం పవన్ కి వ్యతిరేకంగా కనిపించింది. తాజాగా పవన్ వ్యాఖ్యల్ని బట్టి తన కారణంగా సినిమా వాళ్లు ఇబ్బందులు పడకూడదు అన్న వైఖరి స్పష్టంగా అర్ధమవుతుంది.