Begin typing your search above and press return to search.

ఎవ‌రీ కొత్త ఫ్రెండ్? టైగ‌ర్ కి దిశా టాటా చెప్పేసిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   11 Nov 2022 1:30 AM GMT
ఎవ‌రీ కొత్త ఫ్రెండ్? టైగ‌ర్ కి దిశా టాటా చెప్పేసిన‌ట్టేనా?
X
ఎవ‌రీ అలెక్స్? దిశా ప‌టానీ కొత్త బోయ్ ఫ్రెండా..? అస్స‌లు క్ష‌ణ‌మైనా విడువ‌డు.. నిను వీడ‌ని నీడ‌ను నేను! అన్న చందంగా త‌న‌నే వెంటాడుతున్నాడు. ఇంత‌కీ టైగ‌ర్ కి దిశా టాటా చెప్పేసిన‌ట్టేనా? ఈ ప్ర‌శ్న‌ల‌న్నిటికీ స‌మాధానం కావాలంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

మాజీ బోయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ నుంచి విడిపోయిన తర్వాత దిశా పటానీ సెర్బియా మోడల్ తో డేటింగ్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డం బి-టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవ‌లే స‌ద‌రు మోడ‌ల్ తో క‌లిసి డిన్న‌ర్ డేట్ కి వెళ్లి తిరిగి వ‌స్తున్న‌ప్పుడు మీడియా కంటికి చిక్కింది. దీనిపై నెటిజనుల నుంచి వెల్లువ‌లా స్పంద‌న‌లు వ‌చ్చాయి.

దిశా పటానీ తన చిరకాల మాజీ ప్రియుడు టైగర్ ష్రాఫ్ తో సంబంధంలో లేరు. అయినా ఈ జంట‌పై నిరంత‌రం డేటింగ్ పుకార్లు మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. దేనికీ బ‌ల‌మైన ఆధారాలు అయితే లేవు. ఎట్ట‌కేల‌కు సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ దిశా పటాని ముంబై నగరంలో ఒక మిస్టరీ మ్యాన్ తో డిన్నర్ చేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. ఇప్పటికే ఈ ఫోటోలు సోషల్ మీడియాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

దిశా జీవితంలో టైగర్ స్థానంలో వచ్చిన వ్యక్తి అతడేనా? అంటూ ఇప్పుడు దిశా ప‌టానీ అభిమానులు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అంతా రహస్యంగా కొనసాగుతోంది! హిందుస్థాన్ టైమ్స్ లోని ఓ క‌థ‌నం ప్రకారం... టైగర్ ష్రాఫ్ - దిశా పటానీ గ‌డిచిన కొన్నేళ్లుగా స్థిరమైన రిలేష‌న్ షిప్ లో లేరు. ఆ ఇద్ద‌రూ ఒక‌రికొక‌రు స్నేహంగా క‌నిపించినా కానీ బంధం వీగిపోయింద‌ని స‌ద‌రు క‌థ‌నం పేర్కొంది.

ప్రేమ‌గువ్వ‌లు కొన్ని పరిష్కరించలేని సమస్యల కార‌ణంగా విడిపోయాయి. దిశాప‌టానీతో టైగ‌ర్ వ్య‌వ‌హారం అత‌డి తల్లి గారికి సుతారం ఇష్టం లేద‌ని కూడా గుస‌గుస‌లు వినిపించాయి. అయితే ఈ జంట‌ విడిపోయినప్పటి నుండి ఆ నిర్ణయం వెనుక కారణాలేమిట‌న్న‌ది ఎవ‌రూ స్ప‌ష్ఠంగా మాట్లాడ‌లేదు. చివ‌రికి టైగ‌ర్ తండ్రి గారైన జాకీ ష్రాఫ్ సైతం దీనిపై ఎలాంటి హింట్ ఇవ్వ‌లేదు. ఆ ఇద్ద‌రూ క‌లిసే ఉన్నార‌ని స్నేహంగా ఉన్నార‌ని ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు.

7 నవంబర్ 2022న దిశా పటానీ ముంబైలో ఒక మిస్టరీ మ్యాన్ తో కలిసి డిన్నర్ చేస్తూ కనిపించింది. దిశా మెరూన్-కలర్ క్రాప్ టాప్ లో ఎప్పటిలాగే చాలా అందంగా కనిపించగా.. త‌న చెంత‌నే ఉన్న చెలికాడు స్మార్ట్ మిస్టరీ మ్యాన్ పూర్తిగా బ్లాక్ క‌ల‌ర్ దుస్తులలో అందంగా కనిపించాడు. ఇద్దరూ బ్లాక్ మెర్సిడెస్ నుండి బయటకు వెళ్లి నేరుగా రెస్టారెంట్ లోపలికి వెళుతుండ‌గా మీడియా వారిని కెమెరాల్లో బంధించింది. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన‌ వెంటనే మిస్టరీ మ్యాన్ తో దిశా డేటింగ్ గురించి మీడియాలో క‌థ‌నాలు సంచలనం సృష్టించాయి.

ఇది మాత్రమే కాదు.. టైగర్ ష్రాఫ్ ను కాద‌నుకుని మాజీ ప్రేయసి దిశా ఇలా మిస్టరీ మ్యాన్ తో డిన్నర్ డేట్ కు వెళ్ల‌డమేమిట‌ని నెటిజనులు ధ్వజమెత్తారు. దిశా పటానీతో కనిపించిన మిస్టరీ మ్యాన్ ఫోటోలు సోషల్ మీడియాలో బహిర్గతం అయిన వెంటనే కొంద‌రు అత‌డి వివ‌రాల గురించి శోధించారు. తాజా క‌థ‌నాల‌ ప్రకారం దిషాతో కనిపించిన మిస్టరీ మ్యాన్ మరెవరో కాదు.. ఆమెకు జిమ్ ట్రైనర్ .. సన్నిహిత స్నేహితుడు అలెగ్జాండర్ అలెక్ ఇలిక్. అలెగ్జాండర్ అలెక్ సెర్బియాకు చెందిన‌ జిమ్ ట్రైనర్. అతను దిశాతో గతంలో రెండు సార్లు కనిపించాడు. ఓ సంద‌ర్భంలో టైగ‌ర్ ష్రాఫ్ తో క‌లిసి అత‌డు క‌నిపించడం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

25 అక్టోబర్ 2022న అలెగ్జాండర్ అలెక్ ఇలిక్ తన ఇన్ స్టాగ్రామ్ లో తన అభిమానులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు చెబుతూ రెండు వేర్వేరు పోస్ట్ లను షేర్ చేసాడు. మొదటి పోస్ట్ లో అతడు తన సన్నిహితురాలు అందాల హీరోయిన్ దిశా పటానితో ఒక అద్భుతమైన సెల్ఫీని షేర్ చేసాడు. ఇందులో ఇద్దరూ లిఫ్ట్ లో సెల్ఫీ కోసం పోజులిస్తూ క‌నిపించారు. రెండవదానిలో అలెగ్జాండర్ దిశా ప‌టానీ మాజీ ప్రియుడు టైగర్ ష్రాఫ్ తో కలిసి పోజులిచ్చాడు. సెర్బియన్ మోడల్ రెండు ఫోటోలతో ఒకే శీర్షికను జ‌త చేసి అప్ లోడ్ చేయ‌డంతో అంద‌రిలో క‌న్ఫ్యూజ‌న్ క్రియేట్ చేసాడు.

దిశా పటానీ- టైగ‌ర్ ఇద్ద‌రికీ అలెక్సాండర్ అలెక్ ఇలిక్ స్నేహితుడా? అలాంట‌ప్పుడు దిశాతో అత‌డు డేటింగ్ కి వెళ్ల‌డం ఎలా పాజిబుల్? అన్న డౌట్లు పుట్టుకొస్తున్నాయి. అయితే దిశాతో అలెక్స్ డేటింగ్ పుకార్లకు చెక్ పెట్టేందుకు ఆ ఇద్దరూ మీడియా ముందుకు వ‌స్తారా లేదా? అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది. కొన్నిటికి కాల‌మే స‌మాధానం. అంత‌వ‌ర‌కూ వేచి చూడాల్సిందే. దిశా పటానీ... టైగ‌ర్ ఇద్ద‌రూ డేటింగుల్ని మించి ఎవ‌రి దారిలో వారు త‌మ కెరీర్ పైనే దృష్టి సారించిన‌ట్టు అవ‌గ‌త‌మ‌వుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.