Begin typing your search above and press return to search.
కమల్ 'విక్రమ్'కు డబ్బింగ్ చెప్పింది ఎవరు?
By: Tupaki Desk | 21 May 2022 12:54 PM GMTయూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'. దళపతి విజయ్ తో ఇటీవల 'మాస్టర్'వంటి హిట్ చిత్రాన్ని అందించిన లోకేష్ కనగరాజ్ ఈ మూవీని తెరకెక్కించారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ నటించి ఈ మూవీని నిర్మించారు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ జూన్ 3న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదల చేసిన తమిళ, తెలుగు ట్రైలర్ లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి.
అయితే ముందు తమిళ ట్రైలర్ ని విడుదల చేసిన మేకర్స్ ఆ తరువాత కొంత విరామం తీసుకుని తెలుగు ట్రైలర్ ని విడుదల చేశారు. దీనిపై ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. పాన్ ఇండియా వైడ్ గా దక్షిణాది సినిమాకు క్రేజ్ ఏర్పడిన నేపథ్యంలో ప్రతీ సినిమా మల్టీపుల్ భాషల్లో తమ టీజర్, ట్రైలర్స్ ని ఒకేసారి ఒకే రోజు రిలీజ్ చేస్తోంది. కానీ కమల్ నటించిన 'విక్రమ్' మూవీ తెలుగు ట్రైలర్ మాత్రం ఇలా రెండు మూడు రోజులు ఆలస్యంగా విడుదల కావడం చర్చకు దారితీసింది.
గతంలో కమల్ నటించిన చాలా చిత్రాలకు తెలుగులో స్వర్గీయ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పేవారు. దురదృష్ట వశాత్తు ఇప్పడు ఆయన లేరు. మరి కమల్ కు తెలుగులో ఎవరు డబ్బింగ్ చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. 'విక్రమ్' తెలుగు వెర్షన్ కోసం కమల్ పాత్రకు సూటయ్యే డబ్బింగ్ ఆర్టిస్ట్ కోసం టీమ్ చాలా మందిని పరిశీలించిందట.
అయితే ఎవరూ కమల్ వాయిస్ తో మ్యాచ్ చేయలేకపోవడంతో ఫైనల్ గా తన పాత్రకు కమల్ తానే తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటానన్నారట. అదే చేశారట. ఆ కారణంగానే 'విక్రమ్' తెలుగు ట్రైలర్ రిలీజ్ ఆలస్యం అయిందని తెలుస్తోంది. అప్పట్లో చేసిన సినిమాల్లో కమల్ కొన్ని సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు కూడా. ఆయన తెలుగు స్పష్టంగా మాట్లాడగలరు.
దీంతో ఎవరో తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం ఏంటని కమల్ స్వయంగా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారట. ఆ తరువాత ట్రైలర్ ని విడుదల చేశారట. ఈ విషయం తెలిసిన కమల్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. యాక్షన్ డ్రామాగా రూపొందిన 'విక్రమ్' ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. దీంతో తెలుగులోనూ ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. రామ్ చరణ్ ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేయగా తెలుగులో ఈ మూవీని నితిన్ ఫాదర్ ఎన్. సుధాకర్ రెడ్డి రిలీజ్ చేస్తున్నారు.