Begin typing your search above and press return to search.
బెల్లంకొండతో కన్ఫర్మ్ కాలేదా మారుతి?
By: Tupaki Desk | 11 Sept 2020 5:00 AM ISTదర్శకుడు మారుతి చివరగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ప్రతి రోజు పండుగే సినిమాను చేశాడు. ఆ సినిమాకు కమర్షియల్ గా పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ సినిమా తర్వాత మారుతి మరో యంగ్ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. సమ్మర్ లో ఒక యంగ్ హీరోతో సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా మారుతి సన్నిహితులతో చెప్పాడు. అయితే కరోనా కారణంగా సినిమా షూటింగ్ మొదలు కాలేదు. ఇప్పటికి మారుతి తదుపరి సినిమా విషయంలో క్లారిటీ లేదు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం అల్లుడు అదుర్స్ సినిమాలో నటిస్తున్నాడు. అందుకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాబోతుంది. ఆ వెంటనే మారుతి దర్శకత్వంలో సాయి శ్రీనివాస్ తో సినిమా చేసే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. కాని మారుతి ఇప్పటి వరకు తన తదుపరి చిత్రం ఎవరితో అనే విషయంలో నిర్ణయం తీసుకోలేదు అంటున్నాడు. కొత్త సినిమా హీరో విషయంలో త్వరలోనే చెప్తాను అంటున్నాడు.
ప్రస్తుతం హీరోలు అంతా బిజీ బిజీగా వారి వారి ప్రాజెక్ట్ ల్లో ఉన్నారు. కనుక మారుతికి మరో మూడు నాలుగు నెలల వరకు హీరో దొరికే అవకాశం లేదంటున్నారు. సక్సెస్ కొట్టిన మారుతి సరైన ప్లానింగ్ లేకపోవడంతో ఏడాదికి పైగా సమయంను వృదా చేసుకున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మారుతి వచ్చే ఏడాదిలో అయినా కొత్త సినిమాతో వస్తాడో లేదో చూడాలి.