Begin typing your search above and press return to search.

ఇప్పుడు ఆ హీరోలు రమ్మని పిలుస్తారా

By:  Tupaki Desk   |   24 Feb 2019 5:30 PM GMT
ఇప్పుడు ఆ హీరోలు రమ్మని పిలుస్తారా
X
సినిమా పరిశ్రమలో మనుగడ సాగించాలి అంటే సక్సెస్ ఒక్కటే మార్గం. వేరే ప్రత్యాన్మాయం ఉండదు. హిట్ కొట్టినప్పుడు చెట్టెక్కించే బ్యాచే ఓ రెండు ఫెయిల్యూర్స్ వచ్చే సరికి ఎక్కించిన కొమ్మను నరికేసి కింద పడేస్తారు. ఇంతకు ముందు ఎంత పెద్ద తోపన్నది ముఖ్యం కాదు ఇప్పుడు ఏం చేసావ్ అన్నదే ఇండస్ట్రీ కౌంట్ లోకి వస్తుంది. క్రిష్ ఇప్పుడు ఇదే సంకట స్థితిలో ఉన్నాడు. ఒకటి కాదు ఏకంగా రెండు డిజాస్టర్లు ఒక యావరేజ్ తో తన మీద అంచనాలను మొత్తం తలకిందులు చేసుకున్నాడు.

మణికర్ణిక వివాదాల్లో నలిగిపోయి అసలు ఎవరు దర్శకత్వం వహించారు అనే కంక్లూజన్ కు రాకుండానే ఏదో ఓ మోస్తరుగా ఆడేసి ఫైనల్ రన్ కు దగ్గరలో ఉంది. కానీ ఎన్నో ఆశలు పెట్టుకుని చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుందని భావించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలూ ఒకదాన్ని మించి కోలుకోలేని దెబ్బ కొట్టడం క్రిష్ ఇమేజ్ మీద ఎంత లేదన్నా ప్రభావం చూపిస్తుంది . దీని విడుదల ముందు వరకు మహేష్ బాబు-రామ్ చరణ్-వరుణ్ తేజ్ లాంటి హీరోలు క్రిష్ తో టై అప్ కావాలని ఆసక్తి చూపించిన మాట వాస్తవం. ఆ మేరకు కొన్ని ఫీలర్లు కూడా బయటికి వచ్చాయి.

ఎప్పుడో ఒకసారి సినిమాలను పోగిడే మహేష్ కథానాయకుడు గురించి ఏకంగా రెండు ట్వీట్లు పెట్టాడు. కంచె తీసాక మెగా ఫ్యామిలీకు సైతం క్రిష్ మీద పాజిటివ్ కార్నర్ ఉంది. అల్లు అర్జున్ ఒక దశలో మంచి సబ్జెక్టు కుదిరితే క్రిష్ తో చేయాలన్న అభిప్రాయం వ్యక్తం చేసాడు. ఇప్పుడు ఈ ఎన్టీఆర్ ఫలితాలు చూసాక క్రిష్ ను ఈ హీరోల్లో ఎవరు పిలుస్తారు అనేది ప్రశ్నార్థకమే. పైగా వీళ్ళందరూ తమ కమిట్ మెంట్స్ తో చాలా బిజీగా ఉన్నారు. ఇంకో రెండేళ్ల దాకా వేరే వాళ్లకు దొరకడమే కష్టం. ఈ నేపధ్యంలో క్రిష్ నెక్స్ట్ ఎవరితో ప్లాన్ చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది