Begin typing your search above and press return to search.
MB27 క్యూలో పంచ పాండవులు
By: Tupaki Desk | 11 May 2019 1:30 AM GMTమహేష్ నటించిన 25వ చిత్రం మహర్షి రిలీజై మిశ్రమ స్పందనలు అందుకుంది. తదుపరి మహేష్ నటించే సినిమాల గురించి ఆసక్తికర చర్చ మొదలైంది. మహర్షి ప్రమోషనల్ హడావుడిని త్వరలో ముగించి అటుపై వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా కోసం మహేష్ ప్రిపేరవుతున్నారట. ఇది జూన్ 15న ప్రారంభమవుతుంది. మహేష్ కెరీర్ 26వ సినిమా విషయమై క్లారిటీ వచ్చేసింది కాబట్టి తదుపరి మహేష్ 27 గురించిన డిబేట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే సూపర్ స్టార్ జాబితాలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాదాపు ఐదుగురు డైరెక్టర్స్ క్యూ కట్టారు. ఓ వైపు రాజమౌళితో ఎప్పటినుంచో డిస్కషన్స్ జరుగుతున్నాయని .. త్రివిక్రమ్‌తోనూ సినిమా చర్చల దశలో ఉందని మహేష్ స్వయంగా చెప్పారు. అదే సమయంలో సుకుమార్‌తో ప్రాజెక్ట్ క్యాన్సిల్ కాలేదని.. తనతో ఓ సినిమా ఉంటుందని మొన్న `మహర్షి` ఇంటర్వ్యూలో మహేష్ వివరణ ఇచ్చారు. వీటితోపాటు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఓ కథ చెప్పారు. గీత గోవిందం ఫేమ్ పరుశురామ్ సైతం ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని నెరేట్ చేసారని గత కొంత కాలంగా వార్తలొస్తున్నాయి. పరశురామ్ తో గీతా ఆర్ట్స్ లో ప్లానింగ్ సాగుతోంది.
మరి ఐదుగురు దర్శకుల్లో ఎంబీ 27 ఛాన్స్ ఎవరికి దక్కనుంది? అనీల్ రావిపూడి తర్వాత ఏ దర్శకుడితో సినిమా ఉంటుందనేది సస్పెన్స్ గా మారింది. వాళ్ళందరికి బౌండ్ స్క్రిప్టులు రెడీ చేయమని మహేష్ ఇప్పటికే స్పష్టం చేశారట. రాజమౌళి ప్రాజెక్ట్ చేయాలంటే దాదాపు రెండేళ్లు పడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణలో బిజీ. ఇది వచ్చేఏడాది జులై 30న విడుదల కానుంది. ఆ తర్వాత స్క్రిప్ట్ పై వర్క్ చేయడానికి మరో ఆరు నెలలైనా పడుతుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం బన్నితో సినిమా చేస్తున్నారు. అనంతరం చిరంజీవితో ఓ కమిట్‌మెంట్ ఉంది. అది పూర్తి కావాలన్నా మరో రెండేళ్లు పడుతుంది. ఇక సందీప్ రెడ్డి వంగా హిందీలో అర్జున్‌రెడ్డి రీమేక్ కబీర్‌సింగ్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ తర్వాత వేరొక సినిమా సెట్ కాలేదు. సుకుమార్ ఇప్పటికే అల్లు అర్జున్ సినిమాని లాంచ్ చేసే పనిలో ఉన్నాడు. ఈ శనివారం ఏఏ20 ప్రారంభం కానుంది. వీళ్లందరి బిజీని క్యాష్ చేసుకునేందుకు పరుశురామ్ ప్రస్తుతం మహేష్ కోసం రేయింబవళ్లు కష్టపడి స్క్రిప్ట్ చేసే పనిలో నిమగ్నమయ్యాడట.
క్యూలో ఉన్న ఐదుగురి సన్నివేశాన్ని పరిశీలిస్తే మెజారిటీ పార్ట్ పాజిబిలిటీ పరశురామ్ కే ఎక్కువగా కనిపిస్తోంది. పైగా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఎట్టి పరిస్థితిలో మహేష్ తో అవకాశాన్ని విడిచిపెట్టే ఆలోచనలో లేరని తెలుస్తోంది. అయినా ఈ ఐదుగురిలో మహేష్ ఎవరి సినిమా ఎప్పుడు ఓకే చేస్తాడోననే కన్‌ఫ్యూజన్ ఉందని చెబుతున్నారు. ఇటీవల సుకుమార్ తో మహేష్ అనుభవం దృష్ట్యా పక్కాగా ఎవరు బౌండ్ స్క్రిప్టుతో ఒప్పించగలరో వారిని మాత్రమే జాక్ పాట్ వరిస్తుందని చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఎంబీ 27 జాక్ పాట్ ఎవరిని వరించనుంది?